భాను

అతని పేరు భాను. తోడుగా మరో ముగ్గురు స్నేహితులు. ఆ నలుగురూ ఒక చోటకి చేరితే కబుర్లలో కాలం కరిగిపోవాల్సిందే. కానీ, ఒక్క విషయం మాత్రం వారిమధ్య స్తబ్దు వాతావరణాన్ని సృష్టిస్తుంటుంది. అది, భాను ప్రేమగాథ. ప్రియురాలి నుంచి అతను విడిపోయి నాలుగేళ్లవుతుంది. అయినా ఆమెను మర్చిపోలేకపోతుంటాడు. ఆమెకి పెళ్లై, పిల్లలు ఉండుంటారని తెలిసినా ఆ పాత జ్ఞాపకాల్లోనే ఉంటుంటాడు. అందుకే పెళ్లి కూడా చేసుకోడు. ఓసారి స్నేహితులందరూ కలిసి ఓ హోటల్‌కెళతారు. అక్కడ ఓ చిన్న పాప భానును ఆకట్టుకుంటుంది. ఆ చిన్నారితో కాలక్షేపం చేస్తుండగా, ఆమె తల్లి అక్కడికొస్తుంది. తను ఎవరో కాదు, భాను మాజీ ప్రేయసే! ఆమెను చూసి నిశ్చేష్టుడవుతాడు. ఆమె పరిస్థితీ అంతే! ఆ తర్వాత వారి మధ్య చోటుచేసుకున్న సంభాషణేంటి? భాను జీవితంలో ఎలాంటి మార్పొచ్చింది? చూసి తెలుసుకోవాల్సిందే. జీవితంలో సహజమైన ఎడబాటుకు అనూహ్యమైన ముగింపు ఇవ్వకుండా వాస్తవికంగా సాగుతుందీ లఘుచిత్రం.

భాను

నటీనటులు: గౌతమ్, స్వప్న

నిర్మాత: భానుప్రకాష్‌

రచన, దర్శకత్వం: భానుప్రకాష్‌bal bharatam