ధడ్కన్‌

ఓ యువకుడు... రౌడీలుండే చోటుకెళ్లి దమ్ముంటే తనను చంపమంటూ సవాలు విసురుతాడు. చావుదెబ్బలు తింటాడు. ఎందుకలా చేశావని రౌడీలడిగితే తన ప్రేమ కథ చెప్పుకొస్తాడు. అతని పేరు అర్జున్‌. సోనూని ప్రేమిస్తాడు. తర్వాత ఆమెను ఎవరో వెంబడిస్తున్నారని తెలుస్తుంది. వాళ్లొకసారి సోనూని అల్లరి చేయబోతే కాపాడతాడు కూడా. ఓరోజు తన మనసులోని మాటను సోనూకి చెప్పబోతే, దాటవేస్తుంది. దాంతో అర్జున్‌ గొడవపడతాడు. నిజానికీ సోనూకి అర్జున్‌ మీద ప్రేమ ఉన్నా, చుట్టాల పంచన ఉంటున్న తను వెనకడుగేస్తుంది. కానీ, అర్జున్‌ విషయం ఇంట్లో తెలిసి సోనూని బయటికెళ్లగొడతారు. అప్పుడామెకు ఓ మహిళ కనిపిస్తుంది. ఒకప్పుడు తనని కారు ప్రమాదం నుంచి కాపాడిందన్న కృతజ్ఞతతో సోనూని తనింటికి తీసుకెళ్తుంది. తీరా వెళ్లాక ఆమె అర్జున్‌ తల్లి అని తెలుస్తుంది. తల్లిని కాపాడిన విషయం తెలిసే అర్జున్‌ సోనూని ప్రేమించాడా? మధ్యలో రౌడీలేంటి? అన్నవే ఆసక్తికరం. సాధారణమైన ప్రేమకథకే మలుపుల్ని జోడించి రూపొందించిన చిత్రమిది. చక్కని ఛాయాగ్రహణం, నటన ఆకట్టుకుంటాయి.

ధడ్కన్‌

నటీనటులు: పురుషోత్తం, కీర్తి కాజల్‌

నిర్మాత: చిన్నా మద్దాల

రచన, దర్శకత్వం: చిన్నా మద్దాలbal bharatam