వీకెండ్‌ గాంధీ

సినిమా ఓ ప్రభావవంతమైన మాధ్యమం. దాని ద్వారా విచక్షణను కూడా మేల్కొల్పవచ్చని తెలియజెబుతుందీ చిత్రం. ఓ యువకుడు సామాజిక సందేశాల ప్లకార్డు పట్టుకుని రోడ్డుపక్కన నిలబడి ఉంటాడు. అలా అతణ్ని ఒకటి రెండు సార్లు చూస్తుంది రీతు. అతని మంచి మనసుకు ఆకర్షితురాలై, అతణ్ని కలుసుకుని మరిన్ని వివరాలు తెలుసుకోవాలను కుంటుంది. కానీ, అలాంటి వాళ్లు సమాజ సేవ ముసుగులో అమ్మాయిలకు వల వేస్తుంటారని స్నేహితురాలు వల్లి భయపెడుతుంది. ఈసారతను కనిపిస్తే, బండారం బయట పెట్టేస్తానని అంటుంది. ఓ రోజు అతను మళ్లీ వాళ్లకు కనిపిస్తాడు. వల్లి వివరాలడిగితే, తానో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిననీ, వారాంతంలో సమాజసేవ చేస్తూంటానని చెబుతాడు. అయినా వల్లి అతణ్ని నమ్మదు. కాల్‌ చేసుకోవాలంటూ అతని ఫోన్‌ తీసుకుని ఓ సీక్రెట్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేస్తుంది. తర్వాత వాళ్లకి అతని గురించి తెలిసిందేంటన్నదే అసలు కథ. జీవితం మొత్తం కేవలం మన కోసమే కాకుండా, పక్కవారి మంచికోసం కూడా కొంత సమయం కేటాయించాలని చెబుతుందీ చిత్రం.

వీకెండ్‌ గాంధీ

నటీనటులు: నితీశ్‌ చంద్ర, రసజ్ఞ రీతు

నిర్మాత: బ్రహ్మేశ్వర్‌

రచన, దర్శకత్వం: బ్రహ్మేశ్వర్‌bal bharatam