వేళ

చాలా మంది నటులు, కళాకారులు, దర్శకులు లఘుచిత్రాల్ని తమ ప్రతిభను నిరూపించుకునేందుకు వేదికగా మార్చుకుంటున్నారు. అలాంటి చిత్రమే ఇది. రోహిత్‌ ఓ వైద్య విద్యార్థి. ఆరునెలల కిందట తండ్రిని కోల్పోయిన బాధ నుంచి అప్పుడప్పుడే తేరుకుంటూ ఉంటాడు. గతంలోకి వెళ్లి తన తండ్రిని బతికించుకోవడానికి కాలయంత్రాన్ని రూపొందించే పనిలో ఉంటాడు. తోటివిద్యార్థులంతా పిచ్చివాడంటూ హేళన చేసినా లెక్కచేయడు. ఆలోపు రోహిత్‌ చదువుకుంటున్న వైద్య కళాశాలకి తలకి తీవ్ర గాయాలైన ఒక కుర్రాణ్ని తీసుకొస్తారు. గాయం వల్ల అతని మాట పడిపోతుంది. అతని వివరాలు ఏవీ తెలియవు. మోర్స్‌ కోడ్‌ అనే సంజ్ఞ భాష ద్వారా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు రోహిత్‌. మోర్స్‌ కోడ్‌ ఆ యువకుడికి కూడా తెలుసు. తను పుట్టింది 2026లో అని, తన తండ్రి పేరు రోహిత్‌ అని చెబుతాడు. ఇంతకీ ఆ పిల్లవాడు రోహిత్‌ కొడుకా! ఇందులో కాలయంత్రం పాత్ర ఏంటన్నది ఆసక్తికరం. చివరివరకూ ఉత్కంఠగా సాగుతూ మంచి అనుభూతినిస్తుందీ చిత్రం. 

వేళ

నటీనటులు: రోహిత్‌ రెడ్డి, రిషిక, బన్ని

నిర్మాత: విజయ్‌ రామ్‌

రచన, దర్శకత్వం: విజయ్‌ రామ్‌bal bharatam