మేడ్‌ ఇన్‌ హెవెన్‌

సాధారణంగా తోచే కథే అయినా వైవిధ్య గమనంతో అలరిస్తుందీ చిత్రం. విష్ణు ప్రతిభావంతుడైన యువకుడు. బాగా చదువుకుని స్నేహితులతో కలసి ఓ సంస్థను స్థాపిస్తాడు. ఎదుగుతున్న తన సంస్థకు అవరోధం అవుతుందేమోనని పెళ్లి ఆలోచనని పక్కన పెట్టేస్తాడు. ఇక ప్రేమ సంగతి సరేసరి. అలాంటి విష్ణు ఆఫీసుకి ఒకరోజు లక్ష్మి వస్తుంది. తనేదో ఉద్యోగం కోసం వచ్చిందనుకుని గంభీరంగా ముఖాముఖి మొదలుపెడతాడు. కానీ, ఆమె వచ్చింది పెళ్లిచూపులకోసం! క్యాంటీన్‌లో కూర్చుని మాట్లాడుకుంటుంటే, ఇద్దరి ఆలోచనలూ భిన్నధృవాలని తెలిసిపోతుంది. జీవితంలో కెరీర్‌ ఓ భాగం అనుకునే లక్ష్మి, కెరీరే జీవితం అనుకునే విష్ణులకు ఎక్కడా పొంతన కుదరదు. ఇద్దరి నమ్మకాలూ వేరు! ఈలోగా మరో విషయం కూడా తెలుస్తుంది, చాలా ఏళ్లుగా లక్ష్మి తనను ప్రేమిస్తోందని! అనుకోకుండా ఇలా పెళ్లిచూపుల్లో కలిశారనీ! మరి చివరికి ఈ పెళ్లిచూపులు ఏమయ్యాయి అన్నదే అసలు కథ. ఆకట్టుకునే సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన బలం. 

మేడ్‌ ఇన్‌ హెవెన్‌

నటీనటులు: సీహెచ్‌ వినయ్, యూవీ సుష్మ

నిర్మాత: రష్మి మయూర్‌ కొయ్యాడ

రచన, దర్శకత్వం: రష్మి మయూర్‌ కొయ్యాడbal bharatam