D/o...

పిల్లల్ని ప్రేమతో పెంచాలిగానీ, ప్రేమ దాచిపెట్టి కాదని చెప్పే చిత్రమిది. భార్గవ్‌కి కూతురు కరుణంటే పంచప్రాణాలు. కరుణ పుట్టిన వెంటనే అతని భార్య ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అప్పటి నుంచి పాపకి తల్లీదండ్రీ అన్నీ తానే. కరుణకి కూడా తండ్రే ప్రపంచం. బడిలో పిల్లలందరూ వైజాగ్‌ విహారయాత్రకు వెళుతున్నారని, తనని కూడా పంపమని కరుణ అడుగుతుంది. కానీ, కూతుర్ని పంపడం భార్గవ్‌కు ఇష్టం ఉండదు. దాని గురించి మాట్లాడొద్దని, బుద్ధిగా చదువుకోమని చెబుతాడు. మళ్లీ దాని గురించి కరుణ అడిగితే, మరోసారి విహారయాత్ర అంటే హాస్టల్లో పడేస్తానని విసుక్కుంటాడు. ఆ రోజు భార్గవ్‌ ఆఫీసులో ఉండగా స్కూల్‌ నుంచి సందేశం, కరుణ బడికి రాలేదని! పొద్దున అతనే బండి మీద తీసుకెళ్లి పాపని బడి బయట వదిలిపెడతాడు. మరి కూతురు ఎటెళ్లిందో అని తల్లడిల్లుతాడు. స్కూల్‌కెళ్లి టీచర్లతో పోట్లాడతాడు. పోలీసు ఫిర్యాదు ఇచ్చేముందు ఇంటికెళ్లి చూస్తే పాప అక్కడే ఉంటుంది! ఇంతకీ తను ఎక్కడికెళ్లింది? తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధాన్ని చక్కగా చూపే చిత్రమిది.

D/o...

నటీనటులు: వెంపటి చంద్ర, పిడుగు అక్షర

నిర్మాత: కె.మణిదీప్‌

రచన, దర్శకత్వం: కె.మణిదీప్‌



bal bharatam