యద్భావం తద్భవతి

ఒక మనిషి మారాలంటే అద్భుతాలు జరగాల్సిన అవసరం లేదు, ఆలోచనా విధానం మారితే చాలనే సూత్రం ఆధారంగా తీసిన చిత్రమిది. శివ అల్లరిగా తిరుగుతూ ఇంటి మీదకి గొడవలు తెస్తుంటాడు. శివ చర్యలకు తండ్రి బెంగపడుతూ ఉంటాడు. ఒకరోజు శివ తండ్రికి ఓ ఆలోచన వస్తుంది. తను రోజూ కొడుకు గొడవలు పెట్టుకుని వస్తాడనే ఆలోచనతో ఉండటం వల్ల అవే కార్యరూపం దాలుస్తున్నాయా? అనిపిస్తుంది. ఇక మీద కొడుకు బుద్ధిమంతుడిలా ఉంటాడని నమ్మితే ఫలితం అలాగే ఉంటుందేమో అనుకుంటాడు. దాన్ని శివకి చెబితే కొట్టిపారేస్తాడు. తను చెప్పిందే నిజమని నిరూపించేందుకు ఓ పందెం కడతాడు. ఆ పందెం ఏంటి? శివ తండ్రి నమ్మిన ‘యద్భావం తద్భవతి’ సిద్ధాంతం ఎంతవరకు పనిచేసింది? అన్నది ఆసక్తికరం. ఓ ప్రేమకథను, తండ్రీకొడుకుల అనుబం ధాన్ని, కుర్రవాడి దూకుడునూ, ఆధ్యాత్మికతనూ జోడించడం కొత్తగా ఉంటుంది. ఇందులో తెలుగు ఉపాధ్యాయురాలైన నాయిక తెలుగును కూడా ఆంగ్లంలో బోధిస్తూ నవ్విస్తుంటుంది!

యద్భావం తద్భవతి

నటీనటులు: అభిషేక్‌ బొడ్డేపల్లి, రోహిణి రాచెల్‌

నిర్మాత: సత్య సిద్ధార్థ

రచన, దర్శకత్వం: సత్య సిద్ధార్థbal bharatam