ఆపర్చ్యునిటీ

గతం గురించిన బాధ, భవిష్యత్తు గురించి భయం మనిషిని ఎప్పుడూ వెంటాడుతుంటాయి. కానీ, విషాదం మిగిల్చిన గతాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తే వచ్చే పరిణామాలేంటి?! అన్న ఊహతో అల్లుకున్న కథ ఇది. అతని పేరు ఆనంద్‌. మాయ అనే అమ్మాయితో పెళ్లి అతని జీవితంలోకి పండగ తెస్తుంది. తొలి వివాహ వార్షికోత్సవానికి కొద్ది రోజులుందనగా మాయ ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోతుంది. దాంతో ఆనంద్‌ జీవితం తలకిందులవుతుంది. ఆమె ఎడబాటును తట్టుకోలేక, అతీత శక్తుల ద్వారా అయినా తన భార్యను తిరిగి తెచ్చుకోవాలని అనుకుంటుంటాడు ఆనంద్‌. అలాంటి సమయంలో ఒక రోజు అతని ఇంటికి ఒక పార్శిల్‌ వస్తుంది. అందులో ఉన్న గడియారం ధరించగానే ఓ ఆగంతకుడు ఆనంద్‌ ముందు ప్రత్యక్షమవుతాడు. ఇంతకీ అతనెవరు? ఆనంద్‌కి అతను ఏదైనా సాయం చేశాడా? అసలు ఆనంద్‌ ఆశ నెరవేరిందా? ఇవన్నీ చూసి తెలుసుకోవాల్సిందే. వైవిధ్యమైన కథ, సహజమైన నటన ఈ చిత్రానికి పరిపూర్ణతను తీసుకొస్తాయి.

ఆపర్చ్యునిటీ

నటీనటులు: వివేక్‌ త్రివేది, కృప

నిర్మాత: రవితేజ ముళ్లపూడి

రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడిbal bharatam