ఆకలి

అందరికీ భిన్నంగా వినూత్నంగా ఒక లఘుచిత్రం తీయాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ ఎలా? చిత్రం ఎంత నిడివి ఉండాలి? ఎన్ని పాత్రలు కావాలి? ఇలా ఎన్నో సందేశాలు. వాటన్నింటికీ జవాబు ఈ చిత్రం. 
ఓ గుడిసె గుమ్మం దగ్గర ఆ ఇంటి ఆడమనిషి దీనంగా కూర్చుని ఉంటుంది. ఊయలలో ఉన్న పసిపాప ఆకలి ఏడుపును ఆపలేని దారిద్య్రం ఆమెది. ఆలోగా ఒక బండి వచ్చి గుడిసె ముందు ఆగుతుంది. వచ్చినవాడు ఒక సంపన్నుడు. అతని ఆకలి వేరు! దాన్ని తీర్చుకుని, కొంత డబ్బు ఇచ్చి వెళ్లిపోతాడు. తర్వాత ఆమె ఆ డబ్బు తీసుకుని పాలు తెచ్చి పాపకు పడుతుంది. ఇదీ ఈ చిత్రం కథ. కానీ, కథలో ఉన్న గాఢత కుదిపేస్తుంది. తెలుగులో ఏటా వందల లఘుచిత్రాలు వస్తున్నాయి. అయితే, వాటిలో అయిదు శాతం చిత్రాలకు కూడా తెలుగులో పేర్లు కనిపించవు. అంతా ఆంగ్లమే. ‘ఆకలి’ లాంటివి చూసైనా యువతరం ఈ విషయం గురించి ఆలోచించాలి. నిడివి తక్కువే అయినా గుండెల్ని కదిలిస్తుందీ చిత్రం. 

ఆకలి

నటీనటులు: ఆశ సుదర్శన్, భాస్కర్‌

నిర్మాత: ప్రీతి నోవెలిన్‌ నోముల

రచన, దర్శకత్వం: ప్రీతి నోవెలిన్‌ నోములbal bharatam