అగస్త్య

రుద్ర.. చిన్న వయసులోనే, విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలదొక్కుకున్నవాడు. మరో సంస్థను కూడా తన వ్యాపారంలో కలుపుకునే ప్రయత్నంలో ఉంటాడు. రుద్రకు ఒక రోజు వర్ష అనే అమ్మాయి తారసపడుతుంది. తను ఓ స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్నాననీ, చిన్న సాయం కోసం వచ్చాననీ చెబుతుంది. వర్షకు రుద్ర గొప్ప వ్యాపారవేత్త అని తెలియదు. ఇద్దరి మధ్యా అనుబంధం పెరుగుతుంది. తన వ్యాపారం గురించీ, మనసులోని ప్రేమ గురించీ ఆమెతో చెప్పాలనుకుంటాడు రుద్ర. ఒకరోజు ప్రత్యర్థి సంస్థను కొనే ఒప్పందం మీద రుద్ర సంతకాలు చేస్తున్న సమయంలో వర్ష నుంచి ఫోన్‌... తను ఆపదలో ఉన్నాననీ, వచ్చి కాపాడమని. వెంటనే పరుగు తీస్తాడు రుద్ర. ఇంతకీ వర్షకు ఏం జరిగింది? రుద్ర గతం ఏంటి? తెలియాలంటే ‘అగస్త్య’ చూడాల్సిందే. కథకు పూర్తి ముగింపు ఇవ్వకపోవడం చూస్తే, దీన్ని ఒక ధారావాహికలా తీసే ఉద్దేశం కనిపిస్తుంది. ఎడిటింగ్, కథనం, సంగీతంలో కొంత జాగ్రత్త తీసుకుంటే రాబోయే భాగాలు ఓ చలనచిత్రాన్ని తలపించడం ఖాయం.

అగస్త్య

నటీనటులు: శ్రీనివాస నిఖిల్, అనిమిష

నిర్మాత: బి.వేణు మూర్తి

రచన, దర్శకత్వం: బి.వేణు మూర్తిbal bharatam