రూట్స్‌- మన మూలాలు

మనం ఎంత ఎత్తుకి ఎదిగినా, ప్రపంచం అంచు దాకా వెళ్లినా మన మూలాల్ని మరచిపోకూడదన్న కథాంశంతో రూపుదిద్దుకున్న చిత్రమిది. దిల్లీలో పురాతత్వ శాస్త్రవేత్త అయిన భరత్‌ తన భార్యతో చరిత్ర గురించి మాట్లాడుతున్న సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. మరుసటి రోజు తనకు ప్రత్యేకమైందని, ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా అడగొద్దని భార్యకు చెబుతాడు. అన్నట్లుగానే తర్వాతి రోజు ‘రూట్స్‌-మన మూలాలు’ పేరుతో ఉన్న ఒక ప్రదేశానికి వెళ్తాడు. తాను ముందుగానే రిజర్వ్‌ చేసుకున్న కుంభకారుల దగ్గరికి వెళ్లి బంకమట్టిని తొక్కుతాడు. తానే స్వయంగా కుండ తయారు చేసి దాన్ని దిల్లీ పంపించాలని చెబుతాడు. అలాగే అక్కడ కొనసాగుతున్న కులవృత్తులను చూసి సంబరపడుతుంటాడు. అంతలో అతని భార్య అక్కడ కనిపిస్తుంది! ఆమెకి అక్కడేంపని? అతనికి ఆ ప్రదేశంతో సంబంధం ఏంటి? అక్కడికి ఎందుకొచ్చాడు? చూసి తెలుసుకోవాల్సిందే. చూస్తున్నంతసేపూ గొప్ప అనుభూతిని కలిగించే చిత్రమిది.

రూట్స్‌- మన మూలాలు

నటీనటులు: ఎల్‌.బీ.శ్రీరామ్, రాఖీ, జి.రాజేశ్వర్, శ్రీఅన్వేష్‌

నిర్మాత: ఎల్‌.బి.శ్రీరామ్‌

రచన, దర్శకత్వం: రామా చంద్రమౌళి.bal bharatam