సైలెన్స్‌ ఆఫ్‌ లవ్‌

ప్రేమ.. ఓ అందమైన భావన. ప్రేమ లోకంలో విహరించే వారికి వేల, లక్షల మాటలూ తక్కువే. ఒక్కోసారి మాటలు లేకున్నా ప్రేమ పంచే అనుభూతులు తరగనివి. దాన్ని నిరూపించే చిత్రమే ఇది. ఒక అమ్మాయి, అబ్బాయి ఒకచోట నిలబడి ఉంటారు. అమ్మాయి ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని చూసిన అబ్బాయిలో ఏదో కలవరం. అబ్బాయిని చూసిన అమ్మాయి మోము మీదా చిరునవ్వు. సైగలతోనే తన ఫోన్‌ నంబరు తెలియచేస్తాడా అబ్బాయి. వెంటనే వాట్సప్‌ సందేశాలూ వెళ్లిపోతాయి. ఆ తర్వాత నుంచి ఇద్దరి మధ్యా ఛాటింగులు. ఒకరోజు ఆమె తన మనసులోని ప్రేమను వ్యక్తం చేసేస్తుంది. దాంతోపాటు తాను బధిర యువతినన్న నిజాన్నీ చెప్పేస్తుంది. అటు వైపు నుంచి బదులు రాదు. తర్వాత వారి ప్రేమ ఏమయ్యిందన్నదే అసలు కథ. ఒక్క మాట కూడా లేకుండా లఘుచిత్రం మొత్తం నడిపించడం విశేషం. ఇలాంటి కథలకు నేపథ్య సంగీతం, నటన, కథనం బలంగా ఉండాలి. వాటిలో ఎలాంటి లోటూ కనిపించదు. 

సైలెన్స్‌ ఆఫ్‌ లవ్‌

నటీనటులు: ఆర్‌.ధనుంజయ్‌రెడ్డి, అనుపమ పట్నాయక్‌

నిర్మాత: ఈశ్వర్‌

రచన, దర్శకత్వం: ఈశ్వర్‌



bal bharatam