గోదావరి ప్రేమకథలు

లఘుచిత్రాలు సాంకేతికంగా పెద్ద చిత్రాలతో పోటీపడుతున్న వాస్తవాన్ని రుజువు చేసే ప్రయత్నమిది. బెంగళూరులో ఉద్యోగం చేసే సత్య యాజమాన్యం తీరు నచ్చక కొలువుకి రాజీనామా చేస్తాడు. గోదావరి జిల్లాలోని తన సొంత ఊరుకు బయల్దేరతాడు. రాజమహేంద్రవరానికి చేరుకుని తన ఊరు వెళ్లేందుకు పడవ ఎక్కుతాడు. అదే పడవలో అపూర్వ తారసపడుతుంది. ఆమెది హైదరాబాదు. చిన్నప్పుడే విడిపోయిన మావయ్య కుటుంబాన్ని కలుసుకునేందుకు వస్తుంటుంది. అపూర్వ, సత్యల మధ్య పరిచయం పెరుగుతుంది. వాళ్ల మాటలు సాగుతూండగానే నావ తీరాన్ని చేరుకుంటుంది. ఆమె ఫోన్‌ నెంబరు తీసుకోవాలనుకుంటాడు సత్య. కానీ వీలుపడదు. ఆ తర్వాత ఇద్దరూ ఎలా కలుసుకున్నారన్నదే మిగతా కథ. చివరిలో వచ్చే మలుపులు, పోరాటాలు ఆకట్టుకుంటాయి. సాధారణమైన కథే అయినా, యువతకు మంచి కాలక్షేప చిత్రమిది. సున్నితమైన హాస్యానికి తోడు ధవళేశ్వరం వంతెన, గోదావరి నదిని అందంగా చూపిస్తూ సాగే ఛాయాగ్రహణం మంచి అనుభూతిని కలిగిస్తుంది.

గోదావరి ప్రేమకథలు

నటీనటులు: మెహబూబ్‌ దిల్‌సే, సిరి

నిర్మాత: మను అల్లూరి

రచన, దర్శకత్వం: మను అల్లూరిbal bharatam