ఎయిత్‌ సెన్స్‌

కాలాన్ని, స్థలాన్ని ఆధీనంలోకి తెచ్చుకుని గతంలోకి, భవిష్యత్తులోకి సులువుగా ప్రయాణించగలిగే శక్తి ఎయిత్‌ సెన్స్‌. అలాంటి శక్తి ఉన్న వ్యక్తి కథే ఇది. సర్వజ్ఞ తనకున్న ఈ శక్తిని సంపాదన మార్గంగా వాడుకుంటుంటాడు. తప్పిపోయిన వ్యక్తుల బంధువులు వాళ్ల ఆచూకీ కోసం సర్వజ్ఞ సాయం కోరుతుంటారు. వాళ్ల బాధని సొమ్ము చేసుకుంటుంటాడు సర్వజ్ఞ. ఓ రోజు కాలచక్ర అనే పత్రికకు ఫోనులో ముఖాముఖి ఇస్తాడు. ఈ సందర్భంలో మంత్రి కుమార్తె కిడ్నాప్‌ ఘటన గురించి ప్రశ్నిస్తే, తాను అడిగినంత డబ్బు మంత్రి ఇవ్వలేదని, ఆ ఆలస్యం కారణంగానే పాప చనిపోయిందని చెబుతాడు. ఏది ఏమైనా తనకు డబ్బే ముఖ్యమని అంటాడు. ఈ సమాధానంతో విలేఖరి అతణ్ని కోప్పడుతుంది. ఆ శక్తే అతనికి తగిన శాస్తి చేస్తుందని ఫోన్‌ కట్‌ చేస్తుంది. తర్వాత సర్వజ్ఞ తన భవిష్యత్తు చూసుకుంటే, అతను మరణించబోతున్నట్టు తెలుస్తుంది. మరి దాన్నుంచి తప్పించుకున్నాడా? ఆసక్తికర కథనం ఈ చిత్రానికి ప్రధాన బలం.

ఎయిత్‌ సెన్స్‌

నటీనటులు: కార్తీక్‌ సుందర, యోగి ఖత్రి

నిర్మాత: అమర్‌ బంగారు

రచన, దర్శకత్వం: అమర్‌ బంగారుbal bharatam