మాటే వినదుగా

ఈ తరం యువత సంపాదన చుట్టూ తిరుగుతూ, భావోద్వేగాల్ని వదిలేసుకుని యంత్రాల్లా బతికేస్తోంది. అయినా కొంతమంది మాత్రం వీటికి అతీతంగా ఆనందంగా జీవిస్తున్నా రని చెప్పే చిత్రమిది. రోజూ మార్నింగ్‌ వాక్‌ చేసే సమీరకు వివేక్‌ తారసపడి తన ప్రేమ విషయం చెబుతాడు. తనకు ఒక రహస్య ప్రేమికుడున్నాడని అబద్ధం చెప్పి తప్పించుకుం టుంది. అమెరికా నుంచి పెళ్లి చూపులకని వచ్చిన సిద్దు ఆమెను మార్నింగ్‌వాక్‌లోనే కలుసుకుంటాడు. తనకు మైక్రోసాఫ్ట్‌లో ఏడాదికి 90వేల డాలర్ల జీతమనీ, తన ఇతర ఆస్తి వివరాలు సమీరకు చెబుతాడు. గతంలో రమ్యనువదిలేసి సిద్దు అమెరికా వెళ్లిపోయినందుకు స్నేహితులు తిడతారు. పెద్దలు సిద్దు, సమీరలు ఒక రెస్టరెంట్‌లో మాట్లాడుకునేం దుకు పంపిస్తారు. అక్కడ సిద్దు మాటలకి విసిగిపోతుంది సమీర. ఆ సంబంధాన్ని నిరాకరిస్తుంది. ఆమె ఎందుకు సిద్దుని నిరాకరించింది? రమ్యను సిద్దు ఎందుకు వదిలేసుకున్నాడన్నదే అసలు కథ. సహజమైన నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. 

మాటే వినదుగా

నటీనటులు: సిద్ధు దివాకర్, ఆశ్రితా రావు

నిర్మాత: వై.యన్‌.లోహిత్‌ కళ్యాణ్‌

రచన, దర్శకత్వం: వై.యన్‌.లోహిత్‌ కళ్యాణ్‌bal bharatam