సీతా క‌ల్యాణం

వివాహ బంధం భిన్నధృవాల్ని కలిపి ఉంచగలదు. భాగస్వామి మీద ద్వేషాన్ని కూడా ప్రేమగా మార్చగలదు. అలాంటి వివాహబంధాన్ని సరికొత్తగా చూపించే చిత్రమిది. సీత, హరిలకు పెళ్లై ఏడాది అవుతుంటుంది. కానీ హరికి సీత అంటే ఇష్టం ఉండదు. తను ప్రేమించిన అమ్మాయి మిగిల్చి వెళ్లిన జ్ఞాపకాలతోనే జీవిస్తుంటాడు. సీతను పట్టించుకోడు. అయినా సీత అతడి ప్రేమ కోసం ఓపికగా ఎదురుచూస్తూ ఉంటుంది. వివాహ వార్షికోత్సవం రోజున హరి విడాకుల పత్రాలు తీసుకొచ్చి సీతముందు పెడతాడు. తానిక ఆమెతో సంసారం చెయ్యలేనని, సంతకం పెట్టమని చెబుతాడు. ఊహించని ఘటనకు సీత విస్తుపోయినా, హరికి ఒక షరతు పెడుతుంది. తనతో ట్రూత్‌ ఆర్‌ డేర్‌ ఆట ఆడితే సంతకం పెడతానంటుంది. దానికి హరి ఒప్పుకుంటాడు. ఆ ఆట తర్వాత అతనిలో ఏదైనా మార్పు వచ్చిందా? వాళ్ల జీవితం ఏమయ్యింది? అన్నదే అసలు కథ. సీత, హరిల మధ్య సాగే ప్రశ్నలు, సమాధానాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. సహజ నటన, చక్కని కథనం ఈ చిత్రానికి ప్రధాన బలాలు.

సీతా క‌ల్యాణం

నటీనటులు: తేజస్వి రావ్, రాజశేఖర్‌ కన్నా

నిర్మాత: చందు లెడ్జర్‌

రచన, దర్శకత్వం: చందు లెడ్జర్‌bal bharatam