నీ మాటే నా నిర్ణయం

సున్నితమైన ప్రేమకథలు ఎక్కువకాలం గుర్తుంటాయి. అందులోనూ పల్లెటూరి ప్రేమకథలంటే అందరికీ ఇష్టమే. అలాంటి చిత్రమే ఇది. పెళ్లి ఇష్టంలేక ఆత్మహత్య చేసుకోవాల నుకుంటుంది అభి. తాను ప్రేమించిన మనో ప్రశాంత్‌కు ఫోన్‌ చేసి ఆ విషయం చెబుతుంది. అసలు ఇద్దరి మధ్యా ఏం జరిగిందనేది చూపించేందుకు కథ గతంలోకి వెళ్తుంది. మనోకు ఆర్గానిక్‌ వ్యవసాయం అంటే ఇష్టం. దానికోసం మంచి ఉద్యోగ అవకాశం వచ్చినా వదులుకుంటాడు. ఓరోజు అభిని చూసి ఇష్టపడతాడు. ఇద్దరి మధ్యా అపార్థాలతో మొదలైన గొడవ, ప్రేమకు దారి తీస్తుంది. కొన్నాళ్లకు అభి పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంది. ఆ విషయంలో ఇద్దరికీ గొడవ జరుగుతుంది. తనని మర్చిపొమ్మని చెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోతాడు అభి. ఆ కోపంలో ఇంటికొచ్చిన అభి, తన తండ్రి పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే అంగీకరిస్తుంది. అయితే, పెళ్లి సమయానికి ఆత్మహత్యాయత్నం చేస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? కెమెరా పనితనం, పల్లెటూరి పచ్చదనం ఆకట్టుకుంటాయి.

నీ మాటే నా నిర్ణయం

నటీనటులు: తేజ్‌ దీప్, సోనియా సింగ్‌

నిర్మాత: మను అల్లూరి

రచన, దర్శకత్వం: మను అల్లూరిbal bharatam