సాఫ్ట్‌వేర్‌ అమ్మాయి పెళ్లిచూపులు

ప్రేమించడం ఒకెత్తయితే, ఆ ప్రేమను పెళ్లిపీటలెక్కించడం మరో ఎత్తు. పెద్దల అభిప్రాయాల్ని గౌరవించే పిల్లలకు వారిని నొప్పించకుండా తమ ప్రేమ విషయం చెప్పి ఒప్పించడం క్లిష్టమైన పనే. తండ్రికి తన ప్రేమ విషయం చెప్పాలని మైథిలి చేస్తున్న ప్రయత్నాన్ని తల్లి వారిస్తుంది. తండ్రి చెప్పిన సంబంధాన్నే చేసుకోవాలని, పెళ్లితో మొదలయ్యే ప్రేమకథల ప్రయాణం జీవితాంతం కొనసాగుతూనే ఉంటుందని చెబుతుంది. తల్లిని బాధపెట్టడం ఇష్టంలేక మైథిలి మిన్నకుంటుంది. అనుకున్నట్లుగానే మైథిలికి పెళ్లిచూపులు ఏర్పాటుచేస్తారు. రామ్‌ కుటుంబం మైథిలిని చూసుకోవడానికి వస్తుంది. ఇక్కడి నుంచి కథనం ఆసక్తిగా సాగుతుంది. మైథిలి రామ్‌ను అడిగే ప్రశ్నలు ఇరు కుటుంబాల్ని ఆశ్చర్యపరిచినా, నవ్వు తెప్పిస్తాయి. చివరిగా రామ్‌తో ఒంటరిగా మాట్లాడాలని అడుగుతుంది మైథిలి. ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత పెళ్లికి అంగీకారం తెలుపుతారు. అయితే ఇక్కడ ఓ మలుపు ఉంది. అదే మొత్తం కథకు ప్రాణం. నేపథ్య సంగీతం, కథనం, సంభాషణలు అన్నీ చక్కగా కుదిరాయి. ఒక చిన్న సినిమాను చూసిన అనుభూతిని కలిగిస్తుంది ఈ చిత్రం.

సాఫ్ట్‌వేర్‌ అమ్మాయి పెళ్లిచూపులు

నటీనటులు: శైలేష్‌ సన్ని, రోహిణి రచెల్‌

నిర్మాత: సతీష్‌రెడ్డి మల్లిది

రచన, దర్శకత్వం: సతీష్‌రెడ్డి మల్లిదిbal bharatam