కాలం మారింది

గుడ్డిగా నమ్మి స్నేహం చేసేవాళ్లకి జీవితం చేదు అనుభవాలను మిగుల్చుతుందని చెప్పే చిత్రమిది. శ్రీమంతురాలైన చిన్ని, మధ్యతరగతికి చెందిన కార్తీక్‌ ప్రేమించుకుంటారు. కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన కార్తీక్‌కి ఎక్కడా ఉద్యోగం దొరకదు. ఆ ప్రయత్నాల్లో తలమునకలై ఉంటాడు. చిన్ని తండ్రి రఘురామ్‌కి వీళ్ల ప్రేమ వ్యవహారం తెలుస్తుంది. చిన్నిది సరైన ఎంపిక కాదని, అతణ్ని వదిలేయాలని అంటాడు. కానీ ఆమె వినదు. దేవరాజ్‌ అనే రౌడీకి ఫోన్‌ చేసి కార్తీక్‌ బతికుండకూడదని చెబుతాడు చిన్ని తండ్రి. ఒక కంపెనీకి తన ప్రాజెక్ట్‌ నచ్చడంతో ఉద్యోగం వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అంతలో స్కూటీ మీద వెళ్తున్న చిన్నీకి రోడ్డు ప్రమాదం జరిగితే ఆస్పత్రికి తీసుకెళ్తారు. ఆ ప్రమాదం ఎవరో కావాలని చేయించారనే అనుమానంతో పోలీసులు కార్తీక్‌ను, రఘురామ్‌ను విడివిడిగా విచారణ చేస్తారు. తర్వాత వచ్చే ముగింపు ఈ చిత్రంలో కీలకం. నటీనటుల అభినయం, కథనం ఆకట్టుకుంటాయి.

కాలం మారింది

నటీనటులు: భార్గవ్, మనీషా; దర్శకత్వం: వంశీకృష్ణ

నిర్మాత: వంశీకృష్ణ

రచన, దర్శకత్వం: వంశీకృష్ణbal bharatam