హర్‌ ఫస్ట్‌ పెయిన్‌

పరిస్థితులు బలీయమైన చోట తల్లిపాత్రను కూడా తండ్రి నిర్వర్తించగలడు. అమెరికా నుంచి కూతురుతో ఇండియాకు వచ్చిన రఘు, కరోనా సెల్ఫ్‌ క్వారంటైన్‌లో భాగంగా ఒక హోటల్లో ఉంటాడు. కరోనా కేసులు ఎక్కువవుతున్నాయని  న్యూస్‌ ద్వారా తెలుసుకుని భార్య ఫోన్‌ చేస్తుంది. అమ్మ ఫోన్‌ చేసిందంటూ కూతుర్ని పిలిస్తే, ఆమె ముభావంగా కాఫీ తాగుతుంటుంది. తమ దగ్గర బాగా వర్షం వస్తోందని, సెల్ఫ్‌ క్వారంటైన్‌ అయిపోగానే నేరుగా ఇంటికి వచ్చేయమని చెబుతుంది భార్య. తమ దగ్గర కరెంట్‌ వచ్చి పోతోందని, తన ఫోన్‌ ఎప్పుడైనా స్విచాఫ్‌ కావచ్చని అంటుంది. కూతురికి మెసేజ్‌ చేస్తే రిప్లై ఇవ్వలేదని, జ్వరం ఏమైనా వచ్చిందా అని అడుగుతుంది. బాగనే ఉందని చెబుతాడు. అంతలో బాత్‌రూంకి వెళ్లొచ్చిన అమ్మాయి ప్రవర్తన ఆసాధారణంగా మారిపోతుంది. ఆమెకి ఏం జరిగింది? ఆ తండ్రి ఏం చేశాడు? ఛాయాగ్రహణం, సున్నితమైన అంశాల్ని తెరకెక్కించిన తీరు ప్రధాన ఆకర్షణ. 

హర్‌ ఫస్ట్‌ పెయిన్‌

నటీనటులు: మీనాక్షి, బోబన్‌ శామ్యూల్, ప్రియావర్మ, సన్నీ

నిర్మాత: అఘోష్‌ వైష్ణవం

రచన, దర్శకత్వం: అఘోష్‌ వైష్ణవంbal bharatam