మంచి కాఫీలాంటి పెళ్లిచూపులు

మనల్ని బాగా అర్థం చేసుకున్నవాళ్లని ఎప్పుడూ వదులుకో కూడదని చెప్పే చిత్రమిది. కాఫీషాపులో ఎదురు చూస్తున్న మేఘకు వాళ్లమ్మ ఫోన్‌చేసి అబ్బాయి వచ్చాడా? అంటుంది. ఇంకా రాలేదని చెబితే ఫోన్‌ చెయ్యమంటుంది. అప్పటికే తన ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ లిస్ట్‌ కన్నా పెళ్లిచూపులకొచ్చిన అబ్బాయిల కాంటాక్ట్‌ లిస్టే ఎక్కువుందనీ, కలిశాక నంబర్‌ సేవ్‌ చేసుకుంటాననీ అంటుంది మేఘ. అంతలో అక్కడికొచ్చిన అబ్బాయి తనను పరిచయం చేసుకోబోతుంటే పేరు తెలుసనీ, ఇంకేమైనా చెప్పమని అడుగుతుంది. మేఘ ఏటీఎమ్‌ పిన్‌ నంబర్‌ చెబుతాడతను. ఆమె ఆశ్చర్యపోతుంది. ఆమె అనాథనీ, ఇప్పుడున్న వాళ్లు పెంచుకుంటున్న తల్లిదండ్రులనీ అంటాడు. ఆమె అభిరుచుల గురించి చెబుతూ ఆ పెళ్లిచూపులకు రావడం ఆమెకు ఇష్టం లేదంటాడు. అంతలో మేఘ ఫోన్‌కు ఒక బ్లాంక్‌ మెసేజ్‌ వస్తుంది. ఏడాది నుంచి అవి వస్తుంటాయి. వాటిని పంపేది ఎవరు? ఆ వచ్చిన వ్యక్తిని పెళ్లిచేసుకోడానికి మేఘ అంగీకరించిందా? నటన, సంభాషణలు చిత్రానికి ప్రధాన బలం.

మంచి కాఫీలాంటి పెళ్లిచూపులు

నటీనటులు: లలిత్‌ ఆదిత్య, నిఖిత తన్వాని

నిర్మాత: చైతన్య రాపేటి

రచన, దర్శకత్వం: చైతన్య రాపేటిbal bharatam