నిండు చందురుడు

ఈ తరం అమ్మాయిలు ఎలాంటి వ్యక్తి భర్తగా రావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడం అబ్బాయిలకు తలకు మించిన పనవుతోంది. ఉద్యోగమా? డబ్బా? అందమా?... ఏదీ అర్థంకాక సతమతమవుతున్నారు మగపిల్లలు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అబ్బాయిలకు కొత్తగా వస్తున్న మరో పెద్ద సమస్య ‘బట్టతల’. అదిగో అలాంటి ఓ బట్టతల అబ్బాయి పడే కష్టాలే ఈ చిత్ర కథ. యు.వి.ఎర్రన్న రచనా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బట్టతల అబ్బాయిల బాధలు, అమ్మాయిల ఆలోచనావిధానాన్ని స్పష్టంగా చూపించారు. ‘నీ జీవిత భాగస్వామి ఎలా ఉండాలో నిర్ణయించుకున్నావు కానీ వాళ్లు ఎలాంటి వారిని కోరుకుంటున్నారో తెలుసుకున్నావా?’ అనే మాట ద్వారా అబ్బాయిలకు ఉన్నట్టే అమ్మాయిలకూ సొంత ఆలోచనలు ఉంటాయని చెప్పారు. ‘కొంతమంది అమ్మాయిలని చూసి అంతా ఇంతే అనుకోకూడదు... మనసుని చూసే అమ్మాయిలు కూడా ఉంటార’ంటాడు దర్శకుడు. ‘ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవడం కన్నా పెళ్లి చేసుకున్న వారిని ప్రేమగా చూసుకో చాలు’ అనడమూ అర్థవంతమైందే. అయితే చివరగా ‘చందమామలాంటి వాడు భర్తగా రావాలని కోరుకునే అమ్మాయిలు, ఇలా వెన్నలాంటి మనసున్న నిండు చంద్రుడిలో మచ్చలు వెతకడం ఎంతవరకు సమంజసం? ఆలోచించండి!’ అంటూ పైపై విషయాల గురించే ఆలోచిస్తూ మంచి మనుషులను దూరం చేసుకోకండి అని ఆడపిల్లలకు జాగ్రత్త చెబుతాడు. జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో వ్యక్తిత్వానికే ప్రాధాన్యం ఇవ్వాలి కదా మరి!


మా స్వస్థలం కర్నూలు జిల్లా ఆదోని. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌ (బెంగళూరు)లో పనిచేస్తున్నా. ఈతరంలో 20 శాతం మంది యువత ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలిపోవడం. చూడటానికి చిన్న సమస్యలానే ఉంటుంది కానీ చాలా బాధపెడుతుంది. దీని మీద కాస్త పరిశోధించి, హాస్యాన్ని జోడిస్తూ కథ రాసుకున్నాను. 

- యు.వి.ఎర్రన్న


 

నిండు చందురుడు

నటీనటులు: ఆదిత్య, శృతి, చక్రధర్, వెంకటేష్ కునుపూరు

నిర్మాత: .

రచన, దర్శకత్వం: యు.వి.ఎర్రన్నbal bharatam