సదాగతి

కథనంలో బలం ఉంటే లఘుచిత్రం కూడా వెండితెర చిత్ర అనుభూతిని ఇస్తుందనేందుకు ఉదాహరణ ఈ లఘు చిత్రం. విక్రమ్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అందమైన జీవితం. దానికి మరింత వన్నెనద్దే ప్రేయసి దీపిక. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా సాగదు కదా! ఓ రోజు దీపికకు క్యాన్సర్‌ అని తెలుస్తుంది. చికిత్స అందించినా ప్రయోజం ఉండదు. చివరికి విక్రమ్‌ చేతిలోనే ఆమె కన్నుమూస్తుంది. ఆ బాధను తట్టుకోలేక నిద్రకు దూరమైపోతాడు విక్రమ్‌. పిచ్చివాడిలా రాత్రంతా రోడ్ల మీద కారు నడుపుతూ ఉంటాడు. ఆ సమయంలో దారిలో కనిపించిన వారికి లిఫ్ట్‌ ఇస్తుంటాడు. అలా విక్రమ్‌కు ఓ రోజు శ్రుతి కనిపిస్తుంది. ఆమె జీవితంలోనూ ఓ విషాదం. శ్రుతికి తల్లీదండ్రీ ఉండరు. ప్రాణంగా చూసుకునే అన్నయ్య రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. క్రమంగా వారిద్దరి మధ్యా పరిచయం పెరుగుతుంది. ఓ రోజు విక్రమ్‌ శ్రుతి ఇంటికి వెళితే అనుకోని సంఘటన! ఇంతకీ ఏంటది? రెండు జీవితాల మధ్య జరిగే సంఘటనలను ముందువెనుకలుగా నడిపిస్తూ తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది.

సదాగతి

నటీనటులు: చైతన్య, లిపిక

నిర్మాత: బి.పంకజ్‌

రచన, దర్శకత్వం: బి.పంకజ్‌bal bharatam