మిడిల్‌ క్లాస్‌

‘‘ఓ మధ్యతరగతి కుటుంబం. రెండు ప్రాణాలు. నెలరోజుల గడువు. పదిలక్షల భారం. ఇదీ నా ముందున్న ప్రశ్న’’ అంటూ మొదలవుతుందీ చిత్రం. బీటెక్‌ పూర్తిచేసిన భరత్‌కి సినిమాల్లోకి వెళ్లి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకోవాలని కల. తండ్రికి అది ఇష్టం ఉండదు. సినిమాల్లో నిలదొక్కుకోవడం అంటే.. సినిమా చూసి బయటికొచ్చినంత తేలిక కాదని ఆయన అభిప్రాయం. ‘కష్టానికీ, కరెన్సీకి మధ్య ఉండే మిడిల్‌ క్లాసువాళ్లం మనం’ అంటూ కొడుక్కి నచ్చచెబుతాడు. కానీ భరత్‌ పట్టుదల చూసి అయిష్టంగానే అడ్డు తప్పుకుంటాడు. మరోవైపు భరత్‌ ప్రియురాలు అతను స్థిరపడితేనే తమ పెళ్లికి ఇంట్లోవాళ్లు ఒప్పుకుంటారని గుర్తు చేస్తూ ఉంటుంది. ఓ పదిలక్షలు పెట్టుబడి పెడితే తను నిర్మించబోయే సినిమాలో అవకాశం ఇస్తానని ఓ నిర్మాత భరత్‌కి హామీ ఇస్తాడు. ఇష్టం లేకపోయినా తాను కూడబెట్టిన పదిలక్షల్ని కొడుకు చేతిలో పెడతాడు తండ్రి. ఆ తర్వాత కథ ఏ మలుపు తిరిగిందన్ననే అసలు కథ. ఉత్కంఠగా మొదలై దాన్ని అలాగే కొనసాగిస్తూ సాగుతుందీ చిత్రం. ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది.

మిడిల్‌ క్లాస్‌

నటీనటులు: డి.భరత్‌కుమార్, ప్రమీలా రెడ్డి

నిర్మాత: నరేంద్ర నరేన్‌

రచన, దర్శకత్వం: నరేంద్ర నరేన్‌bal bharatam