ఫైవ్‌ స్టార్స్‌

తేజ ఓ డెలివరీ బాయ్‌. ఊపిరి సలపనంత తిరుగుడు. కానీ జీతం మాత్రం అరకొరే! భార్యాపిల్లల్ని పోషించడానికి చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఓ రోజు ఇంట్లో సరుకులు నిండుకుంటాయి. అతని చేతిలో చిల్లిగవ్వ ఉండదు. తన స్నేహితుణ్ని చేబదులడిగితే, అతని కష్టాలు ఏకరవు పెట్టి సాధ్యం కాదని చెప్పేస్తాడు. ఆ సమయంలో తన డెలివరీ సంస్థ నుంచి తేజకు ఓ ఫోనొస్తుంది. అతని పనితీరు ఆధారంగా ఒక ఆఫర్‌ ఇస్తున్నామని, ఆ రోజు 15 ఆర్డర్లు పూర్తి చేస్తే రూ.వెయ్యి బోనస్‌ ఇస్తామని చెబుతారు. అయితే అందుకు కొన్ని నిబంధనలు పెడతారు. రాత్రి పది లోపు ఆర్డర్లు పూర్తి చేయాలి, సగటు రేటింగ్‌ 4.5 ఉండాలి. డబ్బు అవసరం ఉన్న తేజ ఆ ఆఫర్‌కు ఒప్పుకుంటాడు. మరి అతను లక్ష్యాన్ని చేరుకున్నాడా? ఆ క్రమంలో అతను పడిన కష్టాలేంటి అన్నదే అసలు కథ. అడుగడుగునా ఉత్కంఠ, మధ్య తరగతి జీవితాల్లోని అశక్తత, వ్యాపార వ్యూహాలు అన్నీ కలగలిపిన అరుదైన చిత్రమిది.

ఫైవ్‌ స్టార్స్‌

నటీనటులు: తేజ కాకమాను, అక్షిత, శ్లోక

నిర్మాత: పి.సుధీర్‌

రచన, దర్శకత్వం: పి.సుధీర్‌bal bharatam