మనసా నమః

‘ప్రస్తుతం చేదుగా, భవిష్యత్తు భయంగా ఉంటుందంటారు. కానీ, గతం మాత్రం ఎప్పుడూ మధురంగానే ఉంటుంది’ అంటూ సూర్య విఫలమైన తన ప్రేమ కథల్ని ఒకదాని తరవాత ఒకటి చెబుతుంటాడు. వీటిని వైవిధ్యంగా చెప్పడంలోనే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంది. ‘శీతకాలం’లో సీతతో కలిసి కేఫ్‌కు వెళ్లిన సూర్య తన కథను చెప్పడం మొదలుపెడతాడు. అతను ప్రేమించిన మొదటి అమ్మాయి చైత్ర, ఆ ప్రేమ కథను గుర్తు చేసుకుంటాడు. 
      ఆ తర్వాత అతను ప్రేమించిన వర్ష గురించి చెబుతాడు. అర్థంకాని కారణాలు, భయాలతో తన ప్రేమకథలన్నీ విఫలమయ్యాయని బాధపడతాడు. గతం గురించి బాధ వద్దని, అతనికి తానున్నానని సీత ఓదారుస్తుంది. ఆమె మాటల్లోనూ అతనికి సరైన సమాధానం దొరకదు. ఈ అమ్మాయిలకు ఏం కావాలో వాళ్లకే తెలీదని నిట్టూరుస్తాడు. ఆ తర్వాత వచ్చే ముగింపు ఏంటన్నదే ప్రధానాంశం. ఉన్నత సాంకేతిక విలువలు, చిత్రీకరణ, కమ్రాన్‌ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలాలు.

 మనసా నమః

నటీనటులు: విరాజ్‌ అశ్విన్, వల్లీ రాఘవేందర్, పృథ్వీ శర్మ

నిర్మాత: దీపక్‌ రెడ్డి

రచన, దర్శకత్వం: దీపక్‌ రెడ్డిbal bharatam