జాను

ఆరుల్, జాహ్నవి ప్రేమికులు. బైక్‌పై లాంగ్‌డ్రైవ్‌లకు వెళ్లడం అతనికి చాలా ఇష్టం. ఎప్పట్లాగే ఒకసారి లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్లి రెండు నెలల తర్వాత వస్తాడు. జాహ్నవిని కలిసేందుకు రెస్టారెంట్‌కు వెళ్తాడు. జాహ్నవి మాత్రం అతణ్ని చూడగానే ఇక ఈ బంధం కొనసాగించలేమని చెప్పి బయటికి వెళ్లిపోతుంది. ఆరుల్‌కి అర్థంకాక కారణం ఏంటని అడుగుతూ ఆమెని అనుసరిస్తాడు. రెండు నెలల క్రితం ఆరుల్‌ టూర్‌కి వెళ్లే సమయంలో జాహ్నవి ఫోన్‌ చేస్తుంది. అతను కాల్‌ కట్‌ చేస్తాడు. కానీ, అప్పుడు జాహ్నవి తల్లికి గుండెపోటు వచ్చి ఉంటుంది. ఆమె చనిపోయిందని తెలిసి ఆరుల్‌ బాధపడతాడు.  అవసరమైన సమయంలో తోడుగా లేనందుకు జాహ్నవి అతణ్ని నిందిస్తుంది. ఆరుల్‌ బైక్‌ ప్రయాణాలు తనకు నచ్చడం లేదని, ఇకపై తనకు దూరంగా ఉండమని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏమయ్యిందన్నదే అసలు కథ. సహజ నటన, చక్కని సంభాషణలు ఆకట్టుకుంటాయి.

జాను

నటీనటులు: సిరి రాశి, సీరవ్‌ తమ్మర

నిర్మాత: దీపక్‌ సాయి శ్రీనివాస్

రచన, దర్శకత్వం: దీపక్‌ సాయి శ్రీనివాస్bal bharatam