విధి రాసిన కథ

ఆడపిల్లలకు ఏదో ఒక రూపంలో అడుగడుగునా వేధింపులు. వాటిని కొంతమంది ధైర్యంగా ఎదుర్కొంటుంటే, మరికొందరు తట్టుకోలేక అర్ధంతరంగా జీవితాన్ని ముగిస్తున్నారు. అలాంటి ఒక అమ్మాయి కథే ఇది. వాసంతవి శవాన్ని చూస్తూ ఆమె తల్లి విలపించే సన్నివేశంతో చిత్రం ప్రారంభమవుతుంది. వాసంతవి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, తన మరణం వెనుక ఏదో కారణం ఉందని ఆమె స్నేహితురాలు, పాత్రికేయురాలు దీక్షారెడ్డి నమ్మకం. అదే విషయాన్ని వాసంతవి తల్లికి చెప్పి, ఆమె డైరీ తీసుకుంటుంది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం నగరానికొస్తుంది వాసంతివి. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లినా వేధింపులు. ఉద్యోగం కావాలంటే తనతో గడపాలని ఒక కంపెనీ యజమాని షరతు విధిస్తాడు. ప్రపంచమంతా ఇలాగే ఉందని డైరీలో రాసి, విషం తాగి చనిపోతుంది వాసంతవి. ఇదంతా చదివిన తర్వాత దీక్షారెడ్డి ఏం చేసిందన్నది చూసి తెలుసుకోవాల్సిందే. మనుషుల ఆలోచనా విధానం మారినప్పుడే మహిళలకు రక్షణ అని తెలియజెప్పే చిత్రమిది. 

విధి రాసిన కథ

నటీనటులు: కాజల్‌ మోనా, వైష్ణవి, రవితేజ, సుజాత

నిర్మాత: లక్షుము చిల్లా

రచన, దర్శకత్వం: లక్షుము చిల్లాbal bharatam