నాన్న ఎందుకో వెనుకబడ్డాడు

నాన్న ఎందుకో వెనుకబడ్డాడు.. అంటూ ఆ మధ్య వచ్చిన ఓ కవిత ఆధారంగా రూపొందించిన చిత్రమిది. ఓ మధ్య తరగతి తండ్రి. నీతీ నిజాయతీలే అతని ఆస్తి. పీఎఫ్‌ డబ్బుతో కూతురి పెళ్లి చేస్తాడు. కొడుక్కి తండ్రంటే చిరాకు. ఆయన చేతకానివాడని అతని భావన. కానీ ఆ తండ్రికి కొడుకు మీద కొండంత ప్రేమ. ఓ రోజు తండ్రికి పులస చేపల కూర తినాలనిపిస్తుంది. వాటిని తెచ్చి భార్యకిచ్చి వండమంటాడు. అయితే, అతను తిరిగొచ్చేలోపు కొడుకు తన స్నేహితుడితో కలిసి ఆ కూరని లాగించేస్తాడు. ఆకలితో ఇంటికొచ్చిన తండ్రి, పిల్లలు తృప్తిగా తిన్నారు కదా అని సంతోషిస్తాడు. ఇలాంటి సంఘటలు చాలా జరుగుతుంటాయి. అయినా తండ్రి అనురాగాన్ని ఆ కొడుకు గుర్తించడు. ఒకరోజు తాను విదేశాలకు వెళ్లాలని, పాతిక లక్షలు కావాలని తల్లితో గొడవపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది చూసి తెలుసుకోవాల్సిందే. బిడ్డల పెంపకంలో తల్లి చేసే త్యాగాలే కాదు, తండ్రి కష్టాలను కూడా గుర్తించాలని చెబుతుందీ చిత్రం. 

నాన్న ఎందుకో వెనుకబడ్డాడు

నటీనటులు: చందు సాయి, ఎస్‌.సతీష్, జ్యోతి, రేవతినాధ్‌

నిర్మాత: చందుసాయి

రచన, దర్శకత్వం: చందుసాయిbal bharatam