ఇన్‌విజిబుల్‌ గర్ల్‌ఫ్రెండ్‌

నలుగురు స్నేహితులు మద్యం సేవిస్తుంటారు. వాళ్లలో ఒకడు భయానక కథ అంటూ పాడుబడ్డ బంగళా కథ చెప్పుకొస్తాడు. అవన్నీ కల్పితాలని, తన మామయ్య నిక్కీ జీవితంలో జరిగింది వింటే ఎవరైనా భయపడతారని మరో యువకుడు అంటాడు. 
నిక్కీ మంచి జీతం సంపాదిస్తున్న బ్రహ్మచారి. ఓ రోజు అతని ఫోన్‌కి ఒక అజ్ఞాత స్త్రీ నుంచి సందేశం వస్తుంది. ఎవరో తనను ఆటపట్టిస్తున్నారనుకుని అతను పట్టించుకోడు. కానీ నేరుగా ఆ అమ్మాయే ఫోన్‌ చేసి, అతని పరిచయం కోరుతుంది. కానీ, ఆ అమ్మాయి కలుద్దామని చెప్పిన ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి. విసుగెత్తిన నిక్కీ ఆ అమ్మాయి నంబరు ద్వారా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ నెంబరు ఆమె అన్న పేరు మీద ఉందని, ఆమె ఫోన్‌ నుంచి ఈ మధ్య కాలంలో ఒక్క కాల్‌ కూడా వెళ్లలేదని తెలుస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఆమె మనిషా, దెయ్యమా? చూసి తెలుసుకోవాల్సిందే. చివరి పది నిమిషాలూ ఓ హారర్‌ చిత్రానికి దీటుగా ఉంటుంది. చివర్లో వచ్చే మలుపు ఊహాతీతం. దర్శకత్వ ప్రతిభ, చక్కని సంగీతం, ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన బలాలు. 

ఇన్‌విజిబుల్‌ గర్ల్‌ఫ్రెండ్‌

నటీనటులు: ఎల్‌.నగేష్, విశాల్‌ కట్టా, నవీన జాక్సన్‌

నిర్మాత: జయన్‌ రుద్ర

రచన, దర్శకత్వం: జయన్‌ రుద్రbal bharatam