రీబార్న్‌

నిరాశలో కూరుకుపోయి, ఆత్మహత్యే మార్గమని భావించి జీవితాల్ని అర్ధంతరంగా ముగించేవాళ్లను చూస్తూనే ఉంటాం. కానీ, కష్టాలెన్ని ఎదురైనా జీవితంలో పోరాడి గెలవడం ముఖ్యమని చెబుతుందీ చిత్రం. ఒక ప్రమాదంలో కాలు కోల్పోతాడు ప్రసన్నకుమార్‌. అప్పటి వరకు హాయిగా సాగిపోతున్న జీవితం ఒక్కసారిగా శూన్యంగా మారిపోయినట్లు అనిపిస్తుంది. ఆ మనోవేదనలో ఆత్మహత్య చేసుకోవాల నుకుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగా, అతని తండ్రి చూస్తాడు. ఆత్మహత్య పరిష్కారం కాదని, పదిమందికీ స్ఫూర్తి కలిగించేలా జీవించాలని గుర్తుచేస్తూ, కృత్రిమ కాలు అందిస్తాడు. నిరాశ నుంచి బయటపడిన ప్రసన్న తాను ఏం సాధించగలడో ప్రపంచానికి చూపించాలనుకుంటాడు. మరి అతను అందుకున్న విజయం ఏంటనేదే అసలు కథ. మరో విషయం ఏంటంటే ఇందులో నటించిన ప్రసన్నకుమార్‌ నిజజీవిత కథే ఇది. కథనం, నేపథ్య సంగీతం ప్రధాన బలాలు. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రమిది.

రీబార్న్‌

నటీనటులు: అలిగ ప్రసన్నకుమార్‌

నిర్మాత: సాయి కిరణ్‌ రెడ్డి

రచన, దర్శకత్వం: సాయి కిరణ్‌ రెడ్డిbal bharatam