అనగనగా...

నైతిక పతనానికి డబ్బు కూడా ఒక కారణమే. పల్లెటూళ్లో పొలం పని చేసుకునే ఒక పెద్దాయనకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు వ్యవసాయం మీద ఆసక్తిలేక ఏదైనా వ్యాపారం చెయ్యాలనుకుంటాడు. అందుకోసం డబ్బు కావాల్సొచ్చి తండ్రిని అడుగుతాడు. నీ వ్యాపారానికి అవసరమైన డబ్బును నువ్వే సమకూర్చుకోవాలంటాడు తండ్రి. ఒకరోజు పొలం పనికి వెళ్తూ, దారిలో ఈ విషయమై తండ్రీ కొడుకులకి వాగ్వాదం జరుగుతుంది. అదే సమయంలో కత్తిపోటుకి గురై విలవిల్లాడుతూ ఒక వ్యక్తి కనిపిస్తాడు. తనను సురక్షితంగా ఊరు దాటిస్తే తన దగ్గరున్న బంగారు నాణేల్లో సగం ఇస్తానంటాడు. అయితే ఊర్లో ఏ విషయం జరిగినా ముందు ప్రెసిడెంటుకు తెలియాలని, అక్కడికి తీసుకెల్దామంటాడు తండ్రి. కానీ మొత్తం బంగారం మీద కన్నేసిన పెద్దకొడుకు ఆ వ్యక్తిని అక్కడికక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బంగారు నాణేల పెట్టె వారి జీవితాన్ని ఎలా మలుపుతిప్పిందన్నదే ఇందులో కథ. పాత్రల సహజ నటన, ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

 

అనగనగా...

నటీనటులు: కృష్ణంరాజు, పృథ్వీ కెవిఎమ్, శ్రావణ్‌ నాని

నిర్మాత: పృథ్వీ కెవిఎమ్- తేజాస్‌

రచన, దర్శకత్వం: తేజాస్‌



bal bharatam