సయోని

కులమతాలు, ఆర్థిక అంతరాలు ప్రేమకు పెద్ద అవరోధాలు. అందరు ప్రేమికులూ వాటిని దాటలేరు. అలా విషాదాంతమైన ఒక ప్రేమ కథే ఈ సయోని. రోషన్, ఫాతిమాల మతాలు వేరు. ఓ రోజు ఫాతిమాను చూసి ఇష్టపడతాడు రోషన్‌. మరుసటి రోజు తన తండ్రితో మాట్లాడేందుకు రోషన్‌ ఫోన్‌ తీసుకుంటుంది ఫాతిమా. అలా వారిద్దరి మధ్యా మాటలు మొదలవుతాయి. ఒక రోజు రోషన్‌ తన ప్రేమను చెప్పేందుకు వెళ్తే, అతని మతం గురించి అడుగుతుంది ఫాతిమా. నిజం చెబితే ఆమె ఎక్కడ దూరమవుతుందనే భయంతో అబద్ధం చెబుతాడు. ఆమె అతని ప్రేమను అంగీకరిస్తుంది. కొన్నాళ్లకు అసలు నిజం ఆమెతో చెప్పేస్తాడు. ఏడుస్తూ వెళ్లిపోతుంది ఫాతిమా. మాట్లాడ్డం మానేస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఫోన్‌ చేసి, ఇంటికొచ్చి తన తండ్రితో మాట్లాడమని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది అసలు కథ. ఒక వైపు సమాజం ఎంత అభివృద్ధి చెందుతున్నా మనుషుల మనసుల్లోని వెనుకబాటుతనాన్ని చెప్పే చిత్రమిది.

సయోని

నటీనటులు: దిలీప్‌ గోలి, తేజస్వి రావ్, శ్యామ్, గోపాల్‌

నిర్మాత: చందు లెడ్జర్‌

రచన, దర్శకత్వం: చందు లెడ్జర్‌



bal bharatam