మాయేదో చేసెనె

సాఫీగా జీవితం సాగుతుందేమోగానీ, బంధం సాగదు. గొడవ వచ్చి సమసిపోయిన ప్రతిసారీ బంధం ఇద్దరినీ మరింత దగ్గరచేస్తుంది. ముఖ్యంగా ప్రేమలో ద్వేషం, అసూయలు కూడా బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. వరుణ్‌-దీప్తిలు ఏడాదిగా సహజీవనం చేస్తుంటారు. విడిపోవాల్సిన పరిస్థితులు వస్తే మాత్రం ఎలాంటి గొడవలూ లేకుండా విడిపోవాలన్నది వాళ్లిద్దరి నియమం. దీప్తి బెంగళూరు వెళ్లాల్సిరావడం, వరుణ్‌కి లాంగ్‌ డిస్టెన్స్‌ రిలేషన్‌షిప్‌మీద నమ్మకం లేకపోవడంతో ఇద్దరూ విడిపోదామనుకుంటారు. ఫ్లాట్‌ ఖాళీ చేసి వెళ్దామని నిర్ణయించు కుంటారు. కానీ, ఓరోజు ప్రయాణం వాయిదా వేయడం ఆ తరవాత దేశవ్యాప్తంగా కరోనా కారణంగా పూర్తి లాక్‌ డౌన్‌ అమల్లోకి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరూ అయిష్టంగానే అయినా అదే ఫ్లాట్‌లో ఉండాల్సి వస్తుంది. ఆ లాక్‌డౌన్‌ కాలం వారిలో మార్పు తెచ్చిందా? తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. నిజజీవితంలో తలెత్తే అభిప్రాయభేదాల్నే ఇందులో చూపించడం చిత్రానికి సహజత్వాన్ని తీసుకొచ్చింది.

మాయేదో చేసెనె

నటీనటులు: సిద్ధూ దివాకర్, శరణ్య, సాయిదేవ్, సమీరా పేరి

నిర్మాత: సుభాష్‌ ప్రీతమ్

రచన, దర్శకత్వం:  శ్యాం అనంత్‌, సుభాష్‌ ప్రీతమ్bal bharatam