తపస్వి

ఈ ప్రపంచంలో ఏ మనిషీ ఒంటరి కాడు. ప్రకృతి తోడుగానే ఉంటుంది. గందరగోళంగా ఉన్న మనసును సాంత్వన పరిస్తే చుట్టూ ఉన్న వస్తువులు కూడా మనల్ని పలకరించినట్లే అనిపిస్తుంది. తపస్వి సీనియర్‌ జర్నలిస్టు, రచయిత. దశాబ్దాలుగా తనతోపాటు ప్రయాణిస్తున్న పెన్ను, డైరీ, చేతి గడియారం, ఎఫ్‌డీ బాండ్‌లు తనను పలకరిస్తుంటాయి.. ఆయన కూడా వాటితో మాట్లాడుతుంటాడు. ఏటా ఆయన కుటుంబం తిరుపతి ప్రయాణం గురించి అవి ప్రశ్నవేయడం ఆయన కోప్పడ్డం, ఈలోగా పక్కగదిలో శబ్దం వస్తే వెళ్లడం జరుగుతాయి. అప్పుడే ఆయన కలం తనకు తెలిసిన నిజాన్ని ఇతర వస్తువులతో పంచుకుంటుంది. చేదు జ్ఞాపకాల నుంచి దూరంగా జరగడానికి తపస్వి అబద్ధంలో జీవిస్తున్న విషయం చెబుతుంది. ఇంతకీ ఆ నిజం ఏంటి? అదే కీలకం. శూన్యం నుంచి వెలుగులోకి మన గమనాన్ని మార్చగల శక్తి సానుకూల దృక్పథానికి ఉంది. అది ఎంత అవసరమో చెబుతూనే, ప్రకృతి ఉన్నంతవరకూ మనిషి ఒంటరికాడు అంటుందీ చిత్రం. తనికెళ్లభరణి నటనే ఈ చిత్రానికి ప్రాణం.

తపస్వి

నటీనటులు: తనికెళ్లభరణి

నిర్మాత: సవిత్‌ సి చంద్ర

రచన, దర్శకత్వం: సవిత్‌ సి చంద్రbal bharatam