నిజమై నిలిచా జతగా

ఎవరి మీదా ఆధారపడని మనస్తత్వం గల ఈతరం అమ్మాయి ఆద్య. తన స్వేచ్ఛని కోల్పోవడం ఇష్టంలేక ప్రేమించిన వ్యక్తికి బ్రేకప్‌ చెబుతుంది. బ్రేకప్‌ తర్వాత ఆద్యని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడానికి ఆమె స్నేహితుడు రాజ్‌ చాలా కష్టపడతాడు. త్వరగానే ఆ బాధ నుంచి బయటపడిన ఆద్య ఓ రోజు రాజ్‌ ఇంటికొస్తుంది. అమ్మాయిలు ప్రేమించినవాణ్ని మర్చిపోవడానికి ఎక్కువ సమయం తీసుకోరంటూ ఆద్యని ఏడిపిస్తాడు రాజ్‌ స్నేహితుడు. అలిగిన ఆద్యని కాఫీషాప్‌కి తీసుకెళ్లిన రాజ్, తనో స్టార్టప్‌ కంపెనీ పెట్టబోతున్నాననీ, ఇన్వెస్టర్‌ కోసం చూస్తున్నాననీ అంటాడు. తర్వాత ఆమెను ఇంటర్వ్యూ కోసం ఓచోట దింపి వెళ్లిపోతాడు. ఆ రాత్రి ఆద్య తండ్రి రాజ్‌కి ఫోన్‌ చేసి ఆమె ఇంకా ఇంటికి రాలేదంటాడు. ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వస్తుంది. ఆద్య ఎక్కడికి వెళ్లింది? రాజ్, ఆద్యల కథ ఏమైంది? ప్రేమలో ఎలాంటి అరమరికలు ఉండకూడదని చెప్పే చిత్రమిది. నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం ఆకట్టుకుంటాయి.

నిజమై నిలిచా జతగా

నటీనటులు: షాహిద్‌ అబ్దుల్, షాలిని

నిర్మాత: శ్యామ్‌ అనంత్‌

రచన, దర్శకత్వం: శ్యామ్‌ అనంత్‌bal bharatam