ఇదేదో బాగుందే

ఇంజినీరింగ్‌ కళాశాల ప్రేమకథలు చాలానే వచ్చాయి ఈ మధ్య. అయితే విడుదలైన వారంలోపే 11 వేల మంది చూసిన ఈ లఘుచిత్రంలో ఏముందా అని ఆలోచిస్తే చాలా ఉంది. ‘‘ప్రేమించడానికి అర్హత, అవకాశం, సరైన ఆలోచన అన్నీ ఉండాలి’’ అని చెప్పే ఈ కథ ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేమ దక్కకపోతే జీవితం ఇంతే అనుకునే వారికి ఓ పాఠం చెప్పినట్టు ఈ చిత్రాన్ని తీశాడు  దర్శకుడు కిశోరుడు. అతని పేరులో కనిపించే తెలుగుదనం... ఈ చిత్ర సంభాషణల్లోనూ మెరుస్తుంది. ‘‘నాలుగేళ్ల ప్రేమ దగ్గరే ఆగిపోతే వందేళ్ల జీవితం అయోమయంలో పడిపోతుంది’’ అన్న మాట బాధ్యతాయుతమైన దృక్కోణాన్ని ప్రతిబింబిస్తుంది. ‘‘నువ్వు నీ బాధ్యతతో నన్ను దూరం చేసుకుంటున్నావు. బాధతో నేనే నీకు దూరమవుతున్నా’’ అనే మాటలో ఇప్పటి యువత ఆవేదన, వారి జీవన పోరాటం కనిపిస్తుంది. సమవయసు ఉన్న అమ్మాయిని ఎందుకు ప్రేమించకూడదో చెప్పే సంభాషణ చాలా సరదాగా ఉన్నా... అందులోనూ నిజం లేకపోలేదనిపించేలా చేస్తుంది. వంశీ సంభాషణలు, కిశోరుడి దర్శకత్వ ప్రతిభ కలిసి ఈ చిత్రానికి చక్కటి రూపమిచ్చాయి. ఇలాంటి కథలు ఇప్పటి  యువతరానికి మేల్కొలుపు పాడతాయి.

ఇదేదో బాగుందే

నటీనటులు:

నిర్మాత: కిషోరుడు

రచన, దర్శకత్వం: కిషోరుడుbal bharatam