ద ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌

ఆకలిగొన్నవాడు రుచిని పట్టించుకోడు! పాపం ఆహారం నాణ్యత గురించీ ఆలోచించడు! నిజానికీ, ఆహారపదార్థాల విషయంలో పాటించాల్సిన నాణ్యత ప్రమాణాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు. దండుకోవడమే ధ్యేయంగా వండివార్చే వ్యాపారస్థులకు ఇదొక వరం. ఈ అంశం నేపథ్యంగా సాగే చిత్రమిది. వైవా ‘హర్ష’ ఇందులో ఆహార తనిఖీ అధికారిగా నటించారు. ఒక వింత సహాయకుడితో అవస్థలు పడుతూ అక్రమార్కుల మీద చర్యలు తీసుకుంటూ ఉంటాడు. ఓ రోజు ఆ ఇద్దరూ దారి పక్కనే ఉన్న కిరాణా దుకాణం తనిఖీకి వెళతారు. దాన్ని పసిగట్టిన యజమాని తన లొసుగులన్నీ కప్పిపెడతాడు. ఎలాగోలా వాటిని ఛేదిస్తాడు మన అధికారి. అటుపై ఓ కళాశాల వసతి గృహానికెళ్లి అక్కడి లోటుపాట్లన్నీ పసిగడతారు. సున్నితమైన హాస్యం ద్వారా ఆహారనాణ్యత గురించి తెలియచెప్పే ప్రయత్నమిది. మధ్యలో నేటి విద్యావ్యవస్థ, వసతి గృహాల్లోని ఆహారాన్ని గురించిన వ్యాఖ్యలు నవ్విస్తాయి. ఇది అసాధారణమైన కథేమీ కాదు. కానీ ఓ చిన్న అంశాన్ని ఎలాంటి హడావుడి లేకుండా సంభాషణల బలంతోనే నడిపించడం ఆకట్టుకుంటుంది. 

ద ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌

నటీనటులు: వైవా హర్ష, శివప్రసాద్‌

నిర్మాత: ఆర్తి

రచన, దర్శకత్వం: ఆర్తిbal bharatam