-
తెలుగు వెలుగు
ఏప్రిల్ 2017
ప్రియమైన రచయితలకు...
తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా సెప్టెంబరు 2012న ‘తెలుగువెలుగు’ మాస పత్రిక ప్రారంభమైంది. మీ అందరి సహకారంతో తన లక్ష్యాల సాధన దిశగా సాగుతోంది. ఈ పయనంలో మరో మైలురాయి ఈ వెబ్సైటు. నేటి సాంకేతిక యుగపు ఆయువుపట్టు అయిన అంతర్జాలంలోనూ తెలుగు విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకురావాలన్న ఆశయంతో దీన్ని మీ ముందుకు తెస్తున్నాం. పత్రిక మాదిరిగానే దీని అభివృద్ధిలో మీ భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నాం
‘తెలుగు వెలుగు’ పత్రికలో భాష, సాహిత్యాలకు సంబంధించిన కథలు, కథా పారిజాతాలు, కథనాలు, వ్యాసాలు, కవితలు, ముఖాముఖిలు వంటి విభిన్న ప్రక్రియల్లో వివిధ ప్రచురితమవుతున్నాయి. అయితే ఇక పత్రికకు సమాంతరంగా వెబ్‌సైట్‌కూడా పనిచేస్తుంది. పత్రికలోని అంశాలను ఉపయోగించుకుంటూనే దీన్ని స్వతంత్రంగా తీర్చిదిద్దాలన్నది మా ఉద్దేశం. ‘తెలుగు వెలుగు’ వచ్చే రచనల్లో పత్రికలో స్థలాభావం చేత వాడలేనివి ఉంటాయి. అటువంటివి రచయిత/త్రుల అనుమతి తీసుకుని వెబ్సైట్లో వాడతాం. ఇలా వాడిన వాటికి కూడా కొంత పారితోషికాన్ని చెల్లిస్తాము. వెబ్సైటులో ప్రచురితమైన రచనల్లో వీక్షకుల ప్రశంసలు పొందిన వాటిని వీలువెంబడి పత్రికలో కూడా ప్రచురిస్తాము. దీంతోపాటు భాష, సాహిత్యం, సంస్కృతి, చరిత్ర వంటి అంశాలకు సంబంధించి ఈనాడులో, ఈటీవీలో వచ్చే వార్తలు, కథనాల లంకెలను కూడా ఇందులో ప్రచురిస్తాము. వెబ్సైట్ కోసం ఉద్దేశించిన మీ రచనలకు హామీపత్రం జోడించి tvweb@ramojifoundation.orgకు మెయిల్ చేయవచ్చు.
హామీ పత్రం:
నేను రచించిన ------------------- అనే కథ/ కవిత/ వ్యాసం/ జోక్ / కార్టూన్/ నవల/ గేయం / రచనను తెలుగువెలుగు/ బాలభారతం/ చతుర/ విపుల పత్రిక/ వెబ్సైటు/ మొబైల్ యాప్‌లో ప్రచురణార్థం పంపుతున్నాను.
ఈ రచన పూర్తిగా నా సొంతం. ఈ రచన మొత్తం కానీ, ఇందులో భాగాలు కానీ ఏ ఇతర రచనకూ కాపీ, అనుసరణ, అనువాదం కాదని హామీ ఇస్తున్నాను. నా రచన మరే ఇతర రచయితల/ ప్రచురణకర్తల కాపీరైట్లనూ ఉల్లంఘించడం లేదు. ఈ విషయంలో తలెత్తే ఏ వివాదాన్నైనా నా సొంత ఖర్చుతో పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను.
ఈ రచన మరే పత్రిక/ వెబ్సైటు/ యాప్/ బ్లాగ్/ పుస్తకాలు/ ఫేస్బుక్/ యూట్యూబ్ ఛానళ్లు తదితర ప్రసార, సామాజిక మాధ్యమాల్లో ప్రచురితం కాలేదు. ప్రస్తుతం పరిశీలనలోనూ లేదు.
ఈ రచన ఎంపికైతే ప్రచురణకు వీలుగా మార్పులు చేర్పులు చేయడానికి సంపాదకవర్గానికి అనుమతి ఇస్తున్నాను.
ఈ రచన ఎంపికైతే దీన్ని తెలుగువెలుగు/ బాలభారతం/ చతుర/ విపుల పత్రిక,వెబ్సైటు, యాప్‌లలో పూర్తిగా కానీ, ఈ రచనలోని భాగాలను కానీ ఉపయోగించుకునేందుకు, ఇతర భాషల్లోకి అనువదించి ప్రచురించేందుకు, సంకలనాలలో ఉపయోగించుకునేందుకు రామోజీ ఫౌండేషన్‌కి నా సమ్మతిని తెలియజేస్తున్నాను.
ఈ రచన తొలిసారి ప్రచురితం అయినప్పుడు తప్ప, ఆ తరువాతి ప్రచురణలకు మరో సారి పారితోషికం/ రాయల్టీ ఉండవన్న నిబంధనను నేను అంగీకరిస్తున్నాను.
ఈ రచన ప్రచురణకు ఎంపిక అయ్యాక, ప్రచురితం అయ్యేలోగా ఏ సంకలనాల్లోనూ ముద్రించనని, మరో పత్రిక/ వెబ్సైటు/ టీవీ ఛానళ్లు వంటి వాటికి పంపనని, సామాజిక మాధ్యమాల్లో ఉంచనని హామీ ఇస్తున్నాను.
ఈ రచనకు సంబంధించి తలెత్తే ఎలాంటి వివాదాలకైనా నాదే బాధ్యత. అలా వివాదాలు తలెత్తిన పక్షంలో వాటిని నా సొంత ఖర్చులతో పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను.
పై విషయాలన్నింటినీ స్వయంగా చదివి, అర్థం చేసుకుని,వాటన్నింటికీ సమ్మతిస్తున్నాను.
సంతకం :
రచయిత పేరు :
చిరునామా :
మెయిల్ :
మొబైల్ : ------------------------------