తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu లక్ష్మణరావుకు డా।। బి.ఎస్‌.ఎన్‌.మూర్తి సారస్వత పురస్కారం

విజయనగరం జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, కథా రచయిత, సాలూరు సాహితీ మిత్ర బృంద ప్రథమ గౌరవ అధ్యక్షులు డా।। బి.ఎస్‌.ఎన్‌.మూర్తి రెండో వర్ధంతిని పురస్కరించుకుని సారస్వత నీరాజనం నిర్వహిస్తున్నట్లు సాహితీ మిత్ర బృందం అధ్యక్ష, కార్యదర్శులు జె.బి.తిరుమలాచార్యులు, కిలపర్తి దాలినాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కవి, బహు గ్రంథకర్త పోతుబరి లక్ష్మణరావుకు డా।। బి.ఎస్‌.ఎన్‌.మూర్తి ద్వితీయ సారస్వత పురస్కారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 2019 డిసెంబరు 15న సాలూరులోని సీతారామ ధర్మశాలలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. సారస్వత నీరాజనంలో భాగంగా నిర్వహించిన కథల పోటీల విజేతల్ని కూడా ప్రకటించారు. ప్రథమ బహుమతి: శ్రీ.జి.ఎస్‌.శర్మ - సికింద్రాబాద్, ‘మంగమ్మగారి మనవడి ఉత్తరం’; ద్వితీయ బహుమతి: డా।। ఎం.రవికుమార్‌ - కోల్‌కతా, ‘వాయస గండం’; తృతీయ బహుమతి: శ్రీమతి ఆర్‌.సుజాతా ప్రసాద్, విజయనగరం ‘దేవతలే శపిస్తే’; 1. ప్రత్యేక బహుమతి: మేడా మస్తాన్‌రెడ్డి, విశాఖపట్టణం, ‘విధి విలాసం’; 2. ప్రత్యేక బహుమతి: కె.వి.లక్ష్మణరావు, మానేపల్లి - తూ.గో.జి. ‘సీత’. కార్యక్రమంలో ప్రతిభావంతులకు సత్కారం, సాంస్కృతిక కార్యక్రమాలూ ఉంటాయి. 

    జె.బి.తిరుమలాచార్యులు
    అధ్యక్షులు, సాలూరు సాహితీ మిత్ర బృందం
    99662 29136
    కిలపర్తి దాలినాయుడు
    కార్యదర్శి, సాలూరు సాహితీ మిత్ర బృందం
    94917 63261

వెనక్కి ...

chef
bal bharatam