తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu పెద్దింటి ఊటబాయి లఘుచిత్రానికి జాతీయ పురస్కారం

ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ కథ, మాటలు అందించిన 'ఊటబాయి' లఘుచిత్రం జాతీయ పురస్కారానికి ఎంపికైంది. మధ్యప్రదేశ్ సింధి పట్టణంలో వింధ్యా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ డిసెంబరు 20, 21, 22 తేదీల్లో జరిగింది. ఈ  జాతీయ లఘుచిత్ర పోటీలకు దేశవ్యాప్తంగా 352 చిత్రాలు పోటీ పడ్డాయి. పెద్దింటి 'ఊటబాయి'ని 'స్ప్రింగ్ వెల్' పేరుతో ఆంగ్లంలోకి అనువదించి ప్రదర్శించారు. 20 నిముషాల నిడివి గల ఈ చిత్రానికి వేణు పొలసాని దర్శకత్వం వహించారు. దిల్లీలో ఈ అవార్డును అందుకోనున్నారు. 
      పెద్దింటి అశోక్‌కుమార్‌ సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని మారుమూల భీముని మల్లారెడ్డిపేటలో జన్మించారు.  రెండువందల కథలు, 6 నవలలు, కథా సంకలనాలు, 7 నాటికలు, 100కు పైగా వ్యాసాలు, 4 సినిమాలకు మాటలు రాశారు. ఆయన రాసిన జిగిరి నవల 9 భాషల్లోకి అనువాదమైంది. 

వెనక్కి ...

chef
bal bharatam