తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu కథానికా సంపుటాలకు ఆహ్వానం

తెలుగు కథానికకూ పట్టాభిషేకం చేసేందుకు ఒక ఉద్యమాన్నే నిర్మించారు డా।। వేదగిరి రాంబాబు. ఆయన సేవకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం ‘డా।। వేదగిరి రాంబాబు కథానికా పురస్కారా’న్ని యువ రచయితలకు ఇస్తున్నారు. 
      ఈ పురస్కారానికి గానూ 14.10.2020 నాటికి 40 ఏళ్లు మించని రచయితల నుంచి ప్రచురిత కథానికా సంపుటాలను నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. ఒక్కొక్కటి ఒక్కో ప్రతి చొప్పున 14.08.2020లోగా అందేలా పంపాలని కోరుతున్నారు. సెప్టెంబరు 14న విజేతని ప్రకటిస్తారు. అక్టోబరు 14న హైదరాబాదులో జరిగే వేదగిరి రాంబాబు జన్మదినోత్సవ కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రదానం చేస్తారు. విజేతకు రూ.5000 నగదు, శాలువా సత్కారం, జ్ఞాపిక అందజేస్తామని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
పుస్తకాలు పంపాల్సిన చిరునామా: సింహప్రసాద్, 401, మయూరి ఎస్టేట్స్, యమ్‌.ఐ.జి-2-650, కెపిహెచ్‌బి కాలని, హైదరాబాదు 500 072. 98490 61668

వెనక్కి ...

chef
bal bharatam