తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu పాలపిట్ట-జైనీ ఫౌండేషన్‌ దసరా కథల పోటీకి ఆహ్వానం

దసరా నేపథ్యంలో పాలపిట్ట మాస పత్రిక, జైనీ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా కథల పోటీ నిర్వహిస్తున్నాయి ‘జైనీ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌’ చాలా ఏళ్లుగా సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 2019లో పన్నెండు మంది రచయితలు, కవులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు అందించి ‘శకుంతలా జైనీ కళా పురస్కారం’తో సత్కరించింది. ఈ ఏడాది ‘పాటపిట్ట’ సహకారంతో కథల పోటీ నిర్వహిస్తోంది. తొలి ముగ్గురు విజేతలకు రూ.10 వేలు, రూ.5 వేలు, రూ.3వేల చొప్పున బహుమతులుంటాయి. 10 కథలకు రూ.వెయ్యి చొప్పున ప్రత్యేక బహుమతులు అందిస్తారు.
నిబంధనలు: మాండలికం లేదా వ్యావహారిక భాషలో కథ రాయవచ్చు. ఇతివృత్తం రచయిత ఇష్టం. పేజీలు, పదాల నిబంధన కూడా లేదు. కథ మనసుకి హత్తుకునేలా ఉండాలి. గతంలో ఎక్కడా ప్రచురితం, ప్రసారం కాలేదని హామీ పత్రం జతచేయాలి. ఎంపికైన కథల్ని పాలపిట్ట మాస, వార్షిక సంచికల్లో ప్రచురిస్తారు. కథలను ఈ మెయిల్‌లో కూడా పంపవచ్చు.
కథలు చేరడానికి ఆఖరి తేదీ: ఆగస్టు, 15. 
చిరునామా: ఎడిటర్, పాలపిట్ట, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట, హైదరాబాదు-500 036
ఈ మెయిళ్లు: palapittamag@gmail.com, palapittabooks@gmail.com
వివ‌రాల‌కు: 98487 87284

వెనక్కి ...

chef
bal bharatam