తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu ‘సిరికోన’ కవితా పురస్కారానికి’ పద్య, దీర్ఘ వచన కవితల ఆహ్వానం

తెలుగు తేజోమూర్తి, భారతదేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ‘సిరికోన కవితా పురస్కారానికి’ పద్య లేదా దీర్ఘ వచన కవితా కావ్యాల్ని ‘సాహితీ సిరికోన వాక్‌స్థలి బృంద వేదిక’ ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు కవులందరూ ఈ పోటీ కోసం కొత్తగా రచన చేసి పంపవచ్చు. ఎంపికైన కావ్యాన్ని 500 ప్రతులు ముద్రించి, 2021 మార్చి - ఏప్రిల్‌ మధ్యలో జరిగే సిరికోన సాహిత్యోత్సవంలో నగదు పురస్కారంతో సత్కరిస్తారు. మేలైన రచనలు ఉంటే పద్య, దీర్ఘ వచన కవిత రెండిట్లో పురస్కారాలు అందిస్తారు. పీవీ జీవితం, దేశానికి అందించిన సేవలు, ఆయన సామాజిక తాత్విక దృష్టి, సంస్కరణలు, సాధించిన విజయాలు ఇతివృత్తంగా రచనలు ఉండాలి. ముద్రణలో కనీసం 60 పుటలకు తగ్గకూడదు. రచన సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా ఎక్కడా ప్రసారం, ప్రచురితం కాకూడదు. కావ్యాన్ని అధ్యాయాలు, ఖండాలుగా విభజించి రాస్తే మంచిది. గతంలో వచ్చిన రచనల్ని పరిశీలనకు తీసుకోబోమని నిర్వాహకులు తెలిపారు.  
రచనలు చేరడానికి ఆఖరు తేదీ: 2020, డిసెంబరు 31 
వివరాలకు : 94418 09566 (గంగిశెట్టి లక్ష్మీనారాయణ); 99488 96984 (జొన్నవిత్తుల శ్రీరామ చంద్రమూర్తి) 
 

వెనక్కి ...

chef
bal bharatam