తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu సీపీ బ్రౌన్ సాహితీ సేవా పుర‌స్కారానికి ఆహ్వానం

తెలుగు భాషా సాహిత్యాల‌కు ఎన‌లేని సేవ చేసిన సీపీ బ్రౌన్ సార‌స్వ‌త కృషిని అవ‌లోకించుకుంటూ సీపీ బ్రౌన్ సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో 2020 నుంచి సాహితీ సేవా పురస్కారం ఇవ్వ‌ద‌ల‌చాం. పాఠ ప‌రిష్క‌ర‌ణ‌, కావ్య వ్యాఖ్య‌‌, నిఘంటు నిర్మాణాల్లో కృషి చేసిన ‌వారికి రూ.10,000 న‌గ‌దు పుర‌స్కారంతో స‌త్క‌రిస్తాం. అభ్య‌ర్థులు వృత్తితో సంబంధం లేకుండా ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత తెలుగు భాషా సాహిత్యాల ఔన్న‌త్యానికి కృషి చేసి ఉండాలి. పాఠ ప‌రిష్క‌ర‌ణ‌, కావ్య వ్యాఖ్య‌, నిఘంటు నిర్మాణం వీటిలో ఎందులో అయినా త‌మ కృషిని వివ‌రిస్తూ వ్య‌క్తిగ‌త వివ‌రాల‌తో పాటు పూర్తి స‌మాచారాన్ని 2020, అక్టోబ‌రు 20 లోపు కింది చిరునామాకు పంపాలి. 
చిరునామా
ఐ.ల‌క్ష్మీ రెడ్డి
కేరాఫ్ విజ‌న్ పీయూ కాలేజీ
నంబ‌ర్ 802, నైన్త్ బి మెయిన్‌
హెచ్ఆర్‌బీఆర్ ఫ‌స్ట్ బ్లాక్‌
బెంగ‌ళూరు 560 043
క‌ర్ణాట‌క‌
వివ‌రాల‌కు ఫోను: 93425 40479

ఇట్లు
ఇడ‌మ‌కంటి ల‌క్ష్మీరె‌డ్డి
అధ్య‌క్షులు, సి.పీ. బ్రౌన్ సేవా స‌మితి

వెనక్కి ...

chef
bal bharatam