తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation
telugu velugu
sahitipotilu డా।। బి.ఎస్‌.ఎన్‌.మూర్తి స్మారక కథల పోటీకి ఆహ్వానం

ప్రముఖ కథారచయిత, విజయనగరం జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డా।। బి.ఎస్‌.ఎన్‌.మూర్తి స్మారక జాతీయ స్థాయి కథల పోటీకి రచనలను ఆహ్వానిస్తున్నాం. సామాజిక చైతన్యాన్ని కలిగించే వ్యంగ్య కథలు మాత్రమే పంపించాలి.
ప్రథమ బహుమతి: రూ.5000/-
ద్వితీయ బహుమతి: రూ.3000/-
తృతీయ బహుమతి: రూ.2000/-
ప్రత్యేక బహుమతులు:   రూ.1000/- చొప్పున రెండు  
నిబంధనలు:
* కథలు ఎ4 సైజు పేపరు మీద ఒక పక్క మాత్రమే రాయాలి.
* కథలు రాతలో 3 పేజీలు/ డి.టి.పిలో 2 పేజీలకు మించరాదు
* కథతో పాటు 3 జిరాక్స్‌ ప్రతులను పంపాలి.
* కథతో పాటు హామీపత్రాన్ని విధిగా జతచేయాలి.
* హామీపత్రంలోనే రచయిత పేరు, చిరునామా, మొబైల్‌ నంబర్, మెయిల్‌ ఐడీలను పేర్కొనాలి. పాస్‌పోర్టు సైజు ఫొటోను జతపరచాలి.
* ఈ కథ - దేనికీ అనుసరణ, అనుకరణ కాదని, ఈ పోటీకి మాత్రమే రాసిందనీ, ఏ ప్రచార, ప్రసార మాధ్యమాలలో ప్రచురణ లేదా ప్రసారం కాలేదని హామీ పత్రంలో పేర్కొనాలి.
* హామీపత్రంలేని కథలు పరిశీలించడం సాధ్యం కాదు. కథలను తిప్పి పంపడమూ సాధ్యం కాదు.
* ఫలితాలను ప్రకటించడంలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. వాద ప్రతివాదాలకు తావులేదు.
* కథలు పోస్టు/ కొరియర్‌ ద్వారా పంపవచ్చు.
చివరి తేదీ: 15 డిసెంబరు 2020
చిరునామా: జె.బి. తిరుమలాచార్యులు అధ్యక్షులు, సాలూరు సాహితీ మిత్రబృందం, ఫ్లాట్‌ నం.29, శ్రీనివాసనగర్‌ కాలనీ, సాలూరు 535 591 విజయనగరం జిల్లా.
వివరాలకు: జె.బి. తిరుమలాచార్యులు, 99662 29136, కిలిపర్తి దాలినాయుడు, 94917 63261

- సాలూరు సాహితీ మిత్రబృందం
 

వెనక్కి ...

chef
bal bharatam