-
తెలుగు వెలుగు
ఏప్రిల్ 2017
మీరెప్పుడైనా ప్రేమలేఖ రాశారా?
ప్రేమ... ఓ అద్భుత భావన. ఈ రెండక్షరాల గుణంతో ప్రపంచాన్నే జయించవచ్చని మహాత్ములెందరో నిరూపించారు. సరే... మనబోటి మనుషుల సంగతి మాట్లాడుకుందాం. ప్రేమంటే ఒకబ్బాయి, అమ్మాయిల మధ్య ఏర్పడేది మాత్రమే కాదు? అమ్మానాన్నలు, అక్కాచెల్లెళ్లూ, అన్నాదమ్ములూ, తాతయ్యలు, మామ్మలు, అత్తయ్యలు, మామయ్యలు, స్నేహితులు... ఎందరినో గాఢంగా ఇష్టపడతాం. అదంతా ప్రేమే కాదా! మరి అమ్మాయికో, అబ్బాయికో రాసేది మాత్రమే ప్రేమలేఖ అంటే ఎలా? ఎవరిపట్లనైనా మన ప్రేమను వ్యక్తీకరించే జాబు ప్రేమలేఖే అవుతుంది. భర్తకు భార్య రాయవచ్చు. విదేశాల్లో ఉన్న కూతురు తండ్రిపై తన ప్రేమను వ్యక్తం చేస్తూ రాయవచ్చు! సెల్ఫోన్లు వచ్చాక రాయడం ఎందుకంటారా? కొన్ని విషయాలు వినడం కన్నా చదివితే అపురూపంగా ఉంటాయి. తీపి జ్ఞాపకాలుగా భద్రపరచుకోవడానికీ వీలుంటుంది. అందుకే ‘తెలుగు వెలుగు’ ప్రేమలేఖల పోటీ నిర్వహిస్తోంది. కలం పట్టండి... మీరు అమితంగా ఇష్టపడే ఎవరికైనా సరే అద్భుతమైన లేఖ రాయండి! మీ భావాలను సున్నితంగా, హృదయానికి హత్తుకునేలా సృజించండి... అదీ అచ్చ తెలుగులో మాత్రమే!
* కవరు మీద ‘ప్రేమలేఖల పోటీకి’ అని స్పష్టంగా రాయాలి.
* రచన హుందాగా ఉండాలి. అసభ్యత, శృంగార వర్ణనలకు తావివ్వరాదు.
* ప్రత్యామ్నాయం లేకపోతే తప్ప ఆంగ్లపదాలు వాడకూడదు.
* పూర్తి మాండలికంలోనూ రాయవచ్చు. కాకపోతే అందరికీ అర్థం కావాలి కాబట్టి కష్టమైన పదాలకు విడిగా అర్థాలు రాయండి.
* రచన 500 పదాలకు మించకూడదు. చేతి రాత లేదా కంప్యూటర్ ప్రింట్ పంపవచ్చు. జిరాక్సులు చెల్లవు.
* రచన పూర్తిగా మీ సొంతమని, దేనికీ అనుకరణ లేదా అనుసరణ కానీ కాదని, గతంలో ఏ పత్రిక, వెబ్సైట్లు, బ్లాగుల్లోనూ ప్రచురితం కాలేదని, ప్రస్తుతం ఏ ప్రచురణ/ ప్రసార మాధ్యమం వద్దా పరిశీలనలో లేదనీ హామీ పత్రాన్ని జత చేయాలి. మీ రంగుల పాస్పోర్ట్ చిత్రాన్నీ జోడించాలి.
* మీ రచన ఎంపికైతే మీ పేరు, ఫొటో, ఫోన్ నంబరు ప్రచురించవచ్చా లేదా అన్నదీ హామీ పత్రంలో పేర్కొనాలి.
* రచనతో పాటు మీ పేరు, నివాస చిరునామా, ఫోన్ నంబరు వివరంగా ఉండాలి.
* ఎంపికైన ప్రతి లేఖకూ రూ.1116 బహుమతి ఉంటుంది.
* ఎన్ని బాగుంటే అన్నీ ఎంపిక చేస్తాం. వీలువెంబడి ప్రచురిస్తాం.
* ఈ పోటీ తదుపరి ప్రకటించే వరకూ కొనసాగుతుంది. ఎప్పుడైనా నిలిపివేసే అధికారం సంపాదకవర్గానిదే.
* ఎంపిక నిర్ణయం పూర్తిగా సంపాదకవర్గానిదే.
* ప్రచురణకు వీలుగా రచనలో మార్పులు చేసే అధికారం సంపాదకవర్గానికి ఉంటుంది.
* ఎంపిక, ప్రచురణల విషయంలో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు, ఫోన్ విచారణలకు తావు లేదు.
* నిబంధనలకు లోబడని రచనలను తిరస్కరించే హక్కు సంపాదకవర్గానికి ఉంటుంది.
* రచనను teluguvelugu@ramojifoundation.orgకు మెయిల్ చేయవచ్చు.