-
తెలుగు వెలుగు
ఏప్రిల్ 2017
ఉత్తర అమెరికా తెలుగు సంఘం - తానా (TANA) రెండేళ్లకు ఒకసారి నిర్వహించే నవలల పోటీకి నవలలను ఆహ్వానిస్తున్నాం. తెలుగు సాహిత్యంలోనూ, ప్రపంచ సాహిత్యంలోనూ కలకాలం నిలబడే నవలలను వెలికి తీసుకురావాలనే లక్ష్యంతో తానా ఈ పోటీలు నిర్వహిస్తోంది. ఉత్తమ నవలకు రూ.2 లక్షల బహుమతి ఉంటుంది.
నిబంధనలు:
* నవల తెలుగు జీవితాన్ని ప్రతిబింబించాలి.
* ప్రపంచంలోని ఎక్కడివారైనా ఈ పోటీకి నవలలు పంపించవచ్చు.
* నవలకు పేజీల పరిమితి లేదు.
* బహుమతికి ఎంపిక కాని నవలలను తిప్పిపంపడం సాధ్యంకాదు కాబట్టి జిరాక్స్ కాపీలు కూడా పంపవచ్చు.
* నవలలు తమ సొంతమని, అనువాదాలు, అనుసరణలు కాదని, ఇంతకు ముందు ఎక్కడా ప్రచురితం కాలేదని, ఎక్కడికీ ప్రచురణకు పంపలేదని, తానా పోటీ ఫలితాలు వచ్చేవరకూ ఏ ప్రచురణకు, పోటీకి పంపబోమని హామీపత్రాన్ని జతచేయాలి.
* డీటీపీ చేసిన నవలలను 2021tananovel@gmail.comకు పంపవచ్చు.
* నవల మీద రచయిత పేరు, చిరునామా ఉండకూడదు. అవన్నీ కవరింగ్ లెటర్‌పై ఉండాలి.
* నిర్వాహకుల నిర్ణయాల మీద ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.
* ప్రమాణాలకు తగిన నవలలు పోటీకి రాని పక్షంలో బహుమతి ఇవ్వకపోవడం లేదా పూర్తి బహుమతి తగ్గించడం లేదా ఒకటి కంటే ఎక్కువ నవలలకు బహుమతిని పంచడం తానా నిర్ణయం ప్రకారం జరుగుతుంది.
* బహుమతికి ఎంపికైన నవల మొదటి రెండు ముద్రణలను, ఇతర పారితోషికం ఏమీ లేకుండా ప్రచురించే హక్కు తానాకు ఉంటుంది.
నవలలు అందడానికి చివరి తేదీ: 15 ఏప్రిల్ 2021
చిరునామా: అక్షర క్రియేటర్స్, ఎజి-2, ‘ఎ’ బ్లాక్, మాతృశ్రీ అపార్ట్మెంట్స్, హైదర్‌గూడ, హైదరాబాదు 500 029
వివరాలకు: 98493 10560, 040- 29701939, 2021tananovel@gmail.com
ఇట్లు
- జయశేఖర్ తాళ్లూరి, తానా అధ్యక్షులు
- జంపాల చౌదరి, కార్యక్రమ నిర్వాహకులు
- చంద్ర కన్నెగంటి, తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు