-
తెలుగు వెలుగు
ఏప్రిల్ 2017
‘డయాస్పోరా తెలుగు కథ, కవిత (మొదటి సంకలనాల) కోసం విదేశాల్లో ఉంటున్న తెలుగు రచయితల నుంచి కథలు, కవితలు ఆహ్వానిస్తున్నాం. భారతదేశం నుంచి ఉత్తర అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలకి వెళ్లి స్థిరపడిన తెలుగు వారిలో చాలా మంది చెప్పుకోదగ్గ సాహిత్య సృష్టి చేస్తున్నారు. వారి కృషిని గుర్తిస్తూ ఆయా దేశాల డయాస్పోరా కథా సంకలనం, డయాస్పోరా కవితా సంకలనం ప్రచురించాలని వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఖీ నెచ్చెలి అంతర్జాల మాసపత్రిక సంకల్పించాయి. 2021లో విడుదల కానున్న ఈ సంకలనాల కోసం విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు రచనలు పంపవచ్చు.
నిబంధనలు:
- ఒక్కొక్కరు ఒక కథ/ కవిత మాత్రమే పంపాలి.
- రచన తమ సొంతమని, దేనికీ అనువాదం, అనుసరణ కాదని హామీ పత్రం జతచేయాలి. దానితో పాటు తమ ప్రస్తుత చిరునామా తెలియజేయాలి.
- ఇది వరకు ప్రచురితమైన రచనలు కూడా పంపవచ్చు. ప్రచురణ వివరాల్ని కథ/కవిత చివర్లో తెలియజేయాలి.
- రచనతో పాటు ఒక ఫొటో, ఐదు-పది పంక్తుల్లో తమ జీవిత వివరాలు పంపాలి.
- రచనలు పంపే ఈమెయిల్ సబ్జెక్ట్‌లో ‘డయాస్పోరా కథ/ కవిత సంకలనం- 2021- వంగూరి ఫౌండేషన్ ఖీ నెచ్చెలి పత్రిక’ అని తప్పనిసరిగా రాయాలి.
- మాతృదేశ జ్ఞాపకాల మూస కథలూ, కవితలూ (నాస్టాల్జియా రచనలు) ఆమోదించం.
- రచనల ఇతివృత్తం ఆయా దేశాల్లోని స్థానికులు, ప్రవాస భారతీయుల జీవితాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, సమస్యల్ని ప్రతిబింబించేదిగా ఉండాలి.
- రచనలు వర్డ్/ గూగుల్ డాక్యుమెంట్‌గా యూనికోడ్లో మాత్రమే పంపాలి.
- కథల నిడివి వర్డ్‌లో 10 పేజీలు మించకూడదు. కవితలు 30 పంక్తులు దాటకూడదు.
- ఎంపికైన రచనల్ని నెచ్చెలి అంతర్జాల మాసపత్రికలో ప్రచురిస్తాం.
- 2021లో నిర్వహించే 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో ఈ రెండు గ్రంథాల్ని ఆవిష్కరిస్తాం.
- ఎంపికైన రచనల్లో అన్నింటికీ లేదా కొన్నింటికి సముచిత పారితోషికం ఆయా దేశాల నగదులో బహూకరిస్తాం.
కథలు, కవితలు చేరడానికి ఆఖరి తేదీ: ఏప్రిల్ 30, 2021.
రచనలు పంపాల్సిన ఈ మెయిళ్లు:
vangurifoundation@gmail.com
editor.neccheli@gmail.com,
sairacha@gmail.com
ఇట్లు
- వంగూరి చిట్టెన్ రాజు,
అధ్యక్షులు, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
- డా.కె.గీత,
వ్యవస్థాపక సంపాదకులు, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, అమెరికా