తెలుగు వెలుగు కి స్వగతం

Telugu Velugu | Articles Stories Competition Books Magazines Poetry | Ramoji foundation

తెలుగు భాషా సాహిత్యాల మీద ఎలాంటి సందేహాలైనా పంపవచ్చు. మీ ప్రశ్నలకు భాషా నిపుణులు సమాధానాలు ఇస్తారు.


user

పోటీపరీక్షలలో భాగంగా తెలుగును అధ్యయనం చేయడానికి ఉపయోగపడే రచనలేవి?

user

పోటీ పరీక్షలలో భాగంగా తెలుగును అధ్యయనం చేసేవాళ్లు.. ఆధునిక సాహిత్యంపై కూడా దృష్టిపెట్టాలి. తెలంగాణ సాహిత్యంపై కూడా కొత్తపుస్తకాలు అందుబాటులోకొచ్చాయి. కొత్త, పాత సాహిత్య విశేషాల‌ను స‌మ‌న్వ‌యిస్తూ... విభిన్న సాహిత్యాంశాలను జతకలుపుతూ చేసే అధ్యయనానికి ఇవి సహాయపడతాయి.
1. తెలుగు సాహిత్య సమీక్ష - జి. నాగయ్య.
2. బాల, ప్రౌఢ వ్యాకరణాలపై వంతరాం రామకృష్ణారావు వ్యాఖ్యానాలు.
3. ఆంధ్ర‌భాషా వికాసం - గంటిజోగి సోమయాజి.
4. ‘ముంగిలి’ తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర - తెలుగు అకాడమీ
5. తెలంగాణ గిరిజన భాషాసాహిత్యాలు (వ్యాస సంకలనం) తెలంగాణ సారస్వత పరిషత్తు
6. తెలంగాణ తెలుగు సాహిత్యచరిత్ర - డా।। ముదిగంటి సుజాతారెడ్డి. (తెలంగాణ సారస్వత పరిషత్తు)

user

తెలుగు మాధ్యమంలో చదివితే ఉద్యోగావకాశాలున్నాయా?

user

భాషపండితులు, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షలు రాయవచ్చు. అంతేకాదు తెలుగు మాధ్యమంలో చదివితే ఉద్యోగాలు రావనేది అపోహ. చాలా దేశాల్లో మాతృభాషలోనే విద్యాబోధన జరుగుతుంది. జపాన్, చైనా, జర్మనీ వంటి దేశాల్లో సాంకేతికపరమైన విషయాలతోసహా అన్ని విషయాలను అమ్మ భాషలోనే బోధిస్తున్నారు. మరి మనదగ్గర లోపం ఎక్కడ ఉన్నదనేది గ్రహించాలి.

user

తెలుగును అధ్యయనం చేయడంలో ఏర్పడే సమస్యలేంటీ?

user

కర్తృత్వ వివాదాలూ... కవుల స్థలకాలాల విషయంలో భిన్నాభిప్రాయాలూ... బిరుదుల విషయంలో అస్పష్టత        ఏర్పడేందుకు అవకాశాలు ఎక్కువ. కచ్చితత్వం,  స్పష్టత ఉండే అంశాలపైనే దృష్టిపెట్టాలి.

user

సాహిత్య అధ్యయనంలో ప్రశ్నలనిధి ఎంతవరకూ సహాయపడుతుంది?

user

ప్రశ్నోత్తర కౌముది వంటి పుస్తకాలు కొంతవరకూ ఉపయోగపడినప్పటికీ అవి పూర్తిస్థాయి అవగాహన కలిగించలేవు. సాహిత్యం పరిధి లోతైనది. విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడం వల్ల ఎక్కువకాలం గుర్తుపెట్టుకోవచ్చు.